Tragedy: గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ)లో విషాదం చోటుచేసుకుంది. పాముకాటుతో మయన్మార్‌కు చెందిన విద్యార్థి కొండన్న ప్రాణాలు కోల్పోయాడు. సమీపంలోని పొలాల వద్ద పుట్టగొడుగుల కోసం వెళ్లిన నేపథ్యంలో పాము కరిచినట్లు సమాచారం. కొండన్న అనే యువకుడు ఏఎన్‌యూలో బుద్ధిజంలో ఎంఏ చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అతడి కాలిపై రక్తపింజర పాము కాటు వేసింది. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆ విద్యార్థి మృతి చెందాడు. మయన్మార్‌లోని అతడి తల్లిదండ్రులకు యూనివర్సిటీ అధికారులు సమాచారం అందించారు.
Read Also: Karimnagar: అసలే కోతులు.. కంగారు పెట్టి చివరకు నవ్వించిన ఘటన..