Site icon NTV Telugu

Stuart Broad: పెళ్లికి ముందే తండ్రి అయిన ఇంగ్లండ్ క్రికెటర్

Stuart Broad

Stuart Broad

England: ఈ ప్రపంచంలో పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. టీమిండియా క్రికెటర్ హార్డిక్ పాండ్యా పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు. ఇప్పుడు ఈ జాబితాలో ఇంగ్లండ్ క్రికెటర్ కూడా చేరాడు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు. అతడికి కాబోయే భార్య మోలీ కింగ్ తాజాగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ మేరకు తమ కూతురి ఫొటోను మోలీ కింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ చిన్నారికి అన్నాబెల్లా బ్రాడ్‌ అని పేరు కూడా పెట్టారు. బ్రాడ్, మోలీ జంట చాలా ఏళ్ల పాటు డేటింగ్ చేసి.. గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది.

Read Also: IND Vs NZ: లాథమ్ భారీ సెంచరీ.. తొలి వన్డేలో న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ

అటు టీమిండియా హార్దిక్ పాండ్యా పెళ్లికి ముందే తండ్రి అయ్యాడు. పాండ్యా బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్‌ను జనవరి 1, 2020న దుబాయ్‌లో నిశ్చితార్థం చేసుకున్నాడు. వీళ్లిద్దరికి పుట్టిన బిడ్డకు అగస్త్య అనే పేరు పెట్టారు. త్వరలో పాండ్యా దంపతుల వివాహం జరగనుంది. కాగా స్టువర్ట్ బ్రాడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2007లో యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడంటే దానికి కారణం బ్రాడ్. అప్పటి నుంచి టీమిండియా అభిమానులకు బ్రాడ్ అంటే కొంచెం సానుభూతి కూడా ఉంది. ప్రస్తుతం బ్రాడ్ టెస్టు క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. త్వరలో పాకిస్థాన్‌తో జరిగే చారిత్రాత్మక టెస్టు సిరీస్‌కు బ్రాడ్ దూరంగా ఉన్నాడు. ఈ మేరకు అతడి పేరును సెలక్టర్లు ప్రకటించలేదు.

Exit mobile version