Site icon NTV Telugu

Ayodhya Ram mandir: అయోధ్యలో పటిష్టమైన బందోబస్తు.. 10 వేల సీసీ కెమెరాలతో నిఘా

Ayodhya Security

Ayodhya Security

Ram mandir: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలో జై శ్రీరామ్ అనే నినాదాలతో హోరెత్తిపోతుంది. అయితే, బాలరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం కోసం అయోధ్యకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు, భక్తులు భారీ ఎత్తున విచ్చేస్తున్నారు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినిమా రంగం, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపించింది. ఈ నేపథ్యంలో అయోధ్య నగరమంతటా పోలీసులు పటిష్టమైన పహారా ఏర్పాటు చేశారు. ప్రాణ ప్రతిష్ట వేదిక దగ్గర, మందిరం చుట్టూ, మందిరానికి వంద మీటర్ల దూరంలో నలువైపులా పోలీసు అధికారులు, సిబ్బంది మఫ్టీలో గస్తీ కాస్తున్నారు. అలాగే, ఆలయం చుట్టూ కృత్రిమ మేథ(ఏఐ) ఆధారిత సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు.

Read Also: EeshaRebba : పొట్టి గౌనులో అదిరిపోయే పోజులిచ్చిన ఈషా రెబ్బా..

అలాగే, అయోధ్యలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రామ మందిరానికు వచ్చే అన్ని ప్రధాన రహదారులను గ్రీన్‌ కారిడర్‌లుగా మార్చారు. రామమందిర ప్రాణ ప్రతిష్ట కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఉత్తరప్రదేశ్‌ లా అండ్‌ ఆర్డర్‌ స్పెషల్‌ డీజీ ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమం జరిగే ప్రదేశంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉంటుంది అని పేర్కొన్నారు. ఫైజాబాద్‌ జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని లాండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని సైతం వినియోగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Exit mobile version