Election Code: ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గుంటూరు జిల్లా కలెక్టర్, గుంటూరు పార్లమెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వేణుగోపాల రెడ్డి.. ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉంది.. ఈ క్రమంలో ఓటర్ల జాబితా మార్పులు కుదరవు అన్నారు.. కానీ, కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉందన్నారు. ఫామ్ 6 ఉపయోగించి ఓటరు గా నమోదు చేసుకోవచ్చు అని వెల్లడించారు. ఇక, గుంటూరు పార్లమెంట్ పరిధిలో 17 లక్షల ఎనభై వేల మంది ఓటర్లు ఉన్నారని తెలిపిన ఆయన.. ఎన్నికల కమిషన్ ఆదేశాల ఖచ్చితంగా అమలు చేస్తున్నాం… 63 ఫ్లయింగ్ స్క్వాడ్ లు పని చేస్తున్నాయి.. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని వెల్లడించారు.
Read Also: Kurchi Madatha Petti: అమెరికా స్పోర్ట్స్ ఈవెంట్ లో కూడా మన డామినేషనేరా చారి..!
ఇక, ఎన్నికల కోడ్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. ఇప్పటికే ఎన్నికల కోడ్ అతిక్రమించిన 124 మంది వాలంటీర్లపై చర్యలు తీసుకున్నాం అన్నారు వేణుగోపాల రెడ్డి.. జిల్లా సరిహద్దులో 13 నిఘా కేంద్రాలను పెట్టాం.. సింగిల్ విండో విధానం ద్వారా రాజకీయ పార్టీలకు అవసరం అయిన పర్మిషన్ లు ఇస్తున్నాం అన్నారు. నిబంధనలకు లోబడి ఉన్న అన్ని అనుమతులు 48 గంటల లోపు ఇస్తున్నామని వెల్లడించారు. మరోవైపు.. సీ విసిల్ యాప్ ద్వారా 94 శాతం ఫిర్యాదులను రికార్డుస్థాయి సమయంలో పరిష్కరించి చర్యలు తీసుకున్నామని తెలిపారు గుంటూరు జిల్లా కలెక్టర్, గుంటూరు పార్లమెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వేణుగోపాల రెడ్డి.