Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bread Pakoda Recipe: వర్షం పడుతున్న సాయంత్రం అయినా, చల్లని వాతావరణం అయినా.. వేడివేడిగా ఏదైనా స్నాక్ తినాలనిపించడం సహజం. అలాంటి సమయంలో రోడ్‌సైడ్ ఫుడ్ స్టాల్స్‌లో దొరికే బ్రెడ్ పకోడా లేదా బ్రెడ్ బజ్జి చాలామందికి ఫేవరెట్ స్నాక్. బయట దొరికే అదే కరకరలాడే రుచి, స్పైసీ ఫ్లేవర్‌ను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. తక్కువ సమయంలో తయారయ్యే ఈ స్నాక్ కుటుంబ సభ్యులందరికీ నచ్చుతుంది. మరి వీటిని ఎలా చేయాలో ఇక్కడ చూసేద్దామా..
కావలసిన పదార్థాలు:
బజ్జీ పిండి కోసం..
* శనగపిండి – 2 కప్పులు
* వాము – అర టీస్పూన్
* ఉప్పు – తగినంత
* వంటసోడా – చిటికెడు
* కసూరి మేతి – కొద్దిగా
* నీరు – అవసరమైనంత
Also Read
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
ఆలూ స్టఫింగ్ కోసం..
* ఉడికించిన బంగాళాదుంపలు – 4
* అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీస్పూన్
* ధనియాల పొడి – 1 టీస్పూన్
* చాట్ మసాలా – అర టీస్పూన్
* పసుపు – చిటికెడు
* కొత్తిమీర – తరిగినది
గ్రీన్ చట్నీ కోసం..
* కొత్తిమీర
* పుదీనా ఆకులు
* పచ్చిమిర్చి
* అల్లం
* నిమ్మరసం
* మైదా – 2 టేబుల్ స్పూన్లు
ఇతర పదార్థాలు..
* బ్రెడ్ స్లైసులు
* టొమాటో కెచప్
* డీప్ ఫ్రైకి సరిపడా నూనె
తయారీ విధానం:
* ఒక పెద్ద గిన్నెలో శనగపిండి, వాము, ఉప్పు, కసూరి మేతి, వంటసోడా వేసి కలపాలి. అనంతరం నీటిని కొద్దికొద్దిగా పోస్తూ చిక్కటి పిండిలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా సాఫ్ట్‌గా కలిపి పక్కన పెట్టాలి.
* కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, నిమ్మరసం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చివరగా మైదా వేసి మరోసారి కలపాలి. ఇలా చేయడం వల్ల చట్నీ బ్రెడ్‌పై బాగా అంటుకుని ఉంటుంది.
* ఉడికించిన బంగాళాదుంపలను బాగా మెదపాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి అల్లం-మిర్చి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, చాట్ మసాలా వేయించి, అందులో బంగాళాదుంప మిశ్రమం కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి దించాలి.
* బ్రెడ్ స్లైసులను త్రిభుజాకారంలో కట్ చేయాలి. ఒక ముక్కపై గ్రీన్ చట్నీ, మరో ముక్కపై టొమాటో కెచప్ రాయాలి. చట్నీ రాసిన బ్రెడ్‌పై ఆలూ మసాలా పరచి, మరో బ్రెడ్ ముక్కతో కవర్ చేసి స్వల్పంగా ఒత్తాలి.
* కడాయిలో నూనె వేడి చేసి, స్టఫ్ చేసిన బ్రెడ్‌ను శనగపిండి మిశ్రమంలో పూర్తిగా ముంచి నూనెలో వేయాలి. మీడియం మంటపై రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసేయాలి.
* వేడివేడిగా ఉన్న బ్రెడ్ పకోడాను మధ్యలో కట్ చేసి, పైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కారం సేవ్ చల్లుకుని గ్రీన్ చట్నీ లేదా టొమాటో సాస్‌తో సర్వ్ చేస్తే స్ట్రీట్ ఫుడ్ తరహా రుచి వస్తుంది. చల్లటి సాయంత్రాల్లో టీతో పాటు ఈ కరకరలాడే బ్రెడ్ పకోడా సర్వ్ చేస్తే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ స్నాక్‌ను ఆస్వాదించవచ్చు.
తాజావార్తలు
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!