Stree 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‍బస్టర్ హారర్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు స్త్రీ 2
  • శ్రద్ధా కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్‌
  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌
Stree 2 Ott

Stree 2 Ott

Stree 2 OTT Release Date and Platform: బాలీవుడ్‌ నటీనటులు శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్‌ రావు జంటగా నటించిన చిత్రం ‘స్త్రీ 2’. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించిన ఈ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకువచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. జాన్‌ అబ్రహం ‘వేదా’, అక్షయ్‌ కుమార్‌ ‘ఖేల్‌ ఖేల్‌ మే’ సినిమాలకు గట్టి పోటీ ఇచ్చింది. శ్రద్ధా కెరీర్‌లో ఎక్కువ కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా ‘స్త్రీ 2 నిలవడం విశేషం. అలానే రూ.500 కోట్లకు పైగా వసూలు చేసి బాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.

Also Read: KBC 1 Crore: కేబీసీలో సంచలనం.. ఎవరీ చందర్‌ ప్రకాశ్‌?! ఏకంగా ఏడు సర్జరీలు

స్త్రీ 2 ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఫాన్స్ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌ పడింది. స్త్రీ 2 ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా ఫ్రీగా కాకుండా రెంటల్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చింది. ప్రస్తుతానికి 349 రూపాయలు చెల్లించి సినిమా వీక్షించవచ్చు. ఇంకొన్ని రోజులు ఆగితే ఇదే ప్రైమ్ వీడియోలో ఫ్రీ వెర్షన్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.