NTV Telugu Site icon

Street Dog: వీధికుక్క బీభత్సం.. ఒక్కరోజే 80 మందిని కరిచింది..

Stray Dog

Stray Dog

Street Dog: బీహార్‌లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. ఒక్కరోజే 80 మందిని కరిచి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. బీహార్‌లోని అర్రాలో ఒక వీధికుక్క బుధవారం 80 మందిపై దాడి చేసిందని అధికారులు ఈరోజు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కకాటు కేసులతో 80 మందికి పైగా అర్రా జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. వీరందరిపై ఒకే కుక్క దాడి చేసిందని స్థానికులు వెల్లడించారు. కుక్కకాటు కేసులతో అర్రాలోని జిల్లా ఆసుపత్రికి దాదాపు 80 మంది వచ్చారు. రోగులలో 10-12 మంది చిన్నారులు ఉన్నారు. రోగులకు ప్రథమ చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ నవనీత్ కుమార్ చౌదరి తెలిపారు.

విషయం బయటకు పొక్కడంతో వీధికుక్కను కొట్టి చంపినట్లు తెలుస్తోంది. నగరంలోని దూద్ కటోరా ప్రాంతంలోని స్థానికులు గురువారం రాత్రి కర్రలు, రాడ్‌లతో కుక్కను కొట్టి చంపారని స్థానికులు వెల్లడించారు. రేబీస్ సోకిన కుక్క అర్రా నగరంలోని వివిధ ప్రాంతాలలో భీభత్సం సృష్టించిందని వారు పేర్కొన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కను పట్టుకునేందుకు స్థానిక బృందాన్ని పంపించారు. ఆ బృందం చేరుకోకముందే, రాత్రి 12 గంటల సమయంలో స్థానికులు కుక్కను కొట్టి చంపారని జిల్లా అధికారి రాజ్‌కుమార్ తెలిపారు.

Identical Twins: కవలల వింత కోరిక.. ఒకేసారి ఒక్కరితోనే గర్భం దాలుస్తారట..

ఈ ప్రాంతాల్లోని దాదాపు 110 నుంచి 120 మంది చిన్నారులు, వృద్ధులు, మహిళలు సహా కుక్కకాటుకు గురయ్యారు. కొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారు. అనేక మంది రోగులు అర్రా సదర్ ఆసుపత్రికి రావడం ప్రారంభించిన తరువాత, ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. గురువారం అర్రా సదర్ ఆసుపత్రిలో సుమారు 86 మందికి రేబిస్ ఇంజెక్షన్లు ఇచ్చారని అధికారులు తెలిపారు. గణతంత్ర దినోత్సవం దృష్ట్యా సెలవు అయినప్పటికీ జిల్లా అధికారి ఆదేశాల మేరకు సదర్ ఆసుపత్రి ఆవరణలో శిబిరాన్ని ప్రారంభించామని అర్రా సదర్ ఆసుపత్రి మేనేజర్ కౌశల్ దూబే తెలిపారు. 86 మందికి రేబిస్‌ ఇంజక్షన్లు వేసినట్లు తేలింది.

Show comments