NTV Telugu Site icon

WTC Final 2023: టీమిండియా బ్యాటర్లను దెబ్బతీసేందుకు వ్యూహం.. బౌలింగ్ తో ఇబ్బందులు పెడతామంటున్న ఆసీస్ సారథి

Aus

Aus

WTC Final 2023: రేపు( బుధవారం ) నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్‌ జరుగనుంది. ఇప్పటికే ఇరు జట్ల తమ టీమ్ ను ప్రకటించగా.. ఎవరికి వారు ప్రత్యర్థిని దెబ్బకొట్టేందుకు బాగా ప్రిపేర్ అవుతున్నారు. టీమిండియా బ్యాటర్లను ఇబ్బందిపెట్టేందుకు ఆసీస్ ప్రణాళికలు రచించుకున్నారు. అందుకు సంబంధించి ఆసీస్.. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో ఫైనల్ బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ చెప్పాడు. ఇక ఈ ముగ్గురిలో తనతో పాటు, మిచెల్ స్టార్క్‌, స్కాట్‌ బోలండ్‌ ఉన్నారని తెలిపాడు. ఈ సందర్బంగానే తుదిజట్టులో మైఖేల్‌ నెసర్‌ ఉంటాడని జరుగుతున్న ప్రచారంపై కూడా కమ్మిన్స్ ఈ విధంగా బదులిచ్చాడు. బోలండ్ బౌలింగ్‌లో వైవిధ్యం ఉందని, భారత ఆటగాళ్లను కట్టడి చేయగల సత్తా తనలో ఉందని.. అందుకే అతన్ని ఎంచుకున్నట్లుగా పాట్ కమ్మిన్స్ చెప్పాడు.

Read Also: Train Accident: మరో రైలు ప్రమాదం.. సీల్దా-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో మంటలు

టీమిండియాను తమ ముగ్గురి ఫాస్ట్ బౌలింగ్‌తో ఇబ్బందులకు గురిచేస్తామన్నాడు.. అంతేకాకుండా మరొక ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా మెరుపు వేగంతో బంతులు విసరగల సత్తా కలిగిన ఆల్‌రౌండర్ అని కమ్మిన్స్ తెలిపాడు. అంతేకాక ఓవల్ స్పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉంటే.. తమ తరఫున లెజెండరీ స్పిన్నర్ నాథన్‌ లియాన్‌ టీమిండియా బ్యాటర్లకు సమాధానం చెప్పగలడని, ఏది ఏమైనా విజయం తమనే వరిస్తుందని కమ్మిన్స్ ధీమా వ్యక్తం చేశాడు.

Read Also: Minister Talasani: చేప ప్రసాదం పంపిణీకి విస్తృత ఏర్పాట్లు : మంత్రి తలసాని

అటు టీమిండియా తరుఫున పూర్తి క్లారిటీ రాలేదు. ముఖ్యంగా వికెట్ కీపర్ విషయంలో కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ లో ఎవరిని ఆడించాలన్న దానిపై.. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌కి తలనొప్పిలా మారిపోయింది. ఇంకా బౌలర్ల విషయంలో కూడా ఏ మాత్రం క్లారిటీ రాలేదు. ఫైనల్ మ్యాచ్‌లో ముగ్గురు స్పీడ్‌బౌలర్లతో బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నా.. వారెవరనేది తెలియదు.