Site icon NTV Telugu

Gandra Venkata Ramana Reddy: సీఎం రేవంత్ రెడ్డి పగటికలలు కనడం మానుకోవాలి!

Gandra Venkata Ramana Reddy

Gandra Venkata Ramana Reddy

పది సంవత్సరాలు సీఎంగా ఉంటానని చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎవరు? అని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ పగటికలలు కనడం మానుకోవాలని సూచించారు. యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తుందని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఏ మీటింగ్ అయినా కేసీఆర్, కేటీఆర్ పేరు ఎత్తకుండా రేవంత్ రెడ్డి మాట్లాడరు అని విమర్శించారు. రాష్ట్రంలో వర్షపాతంపై రివ్యూ చేశారా? అని గండ్ర ప్రశ్నించారు.

Also Read: MLC Vijayashanti: గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ కాదు.. గుండెపై చేయి వేసి ‘జై తెలంగాణ’ అనండి!

తెలంగాణ భవన్‌లో గండ్ర వెంకటరమణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ రాష్ట్రంలో రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మతం ప్రేక్షకపాత్ర పోషిస్తుంది. భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లిలో ఎరువుల కోసం రైతులు రోడ్డు ఎక్కారు. రైతుల పక్షాన మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ నేతలు రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌ను అమలు చేయడంలేదు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏ మీటింగ్ అయినా కేసీఆర్, కేటీఆర్ పేరు ఎత్తకుండా సీఎం మాట్లాడరు. స్కూల్ పిల్లల మీటింగ్లో సైతం కేసీఆర్ పేరు ఎత్తకుండా రేవంత్ రెడ్డి మాట్లాడరు. రేవంత్ రెడ్డికి పరిపాలనపై అనుభవం లేదు. పది సంవత్సరాలు సీఎంగా ఉంటానని చెప్పడానికి రేవంత్ ఎవరు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారు. రేవంత్ రెడ్డి పగటికలలు కనడం మానుకోవాలి. రాష్ట్రంలో వర్షపాతంపై అసలు రివ్యూ చేశారా?’ అని గండ్ర ప్రశ్నించారు.

Exit mobile version