ఉదయం నష్టాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించిన స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 54,219 పాయింట్ల వద్ద నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించింది.సెన్సెక్స్ 509 పాయింట్లు కుప్పకూలి 53887 వద్ద, నిఫ్టీ 157 పాయింట్లు కోల్పోయి 16,058 వద్ద స్థిరపడ్డాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దడతు లభించకపోవడం వల్ల నష్టాలనే మూటగట్టుకున్నాయి.ఫలితంగా సెన్సెక్స్ 54వేల స్థాయిని కోల్పోగా.. నిఫ్టీ 16100 దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ముగిసాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మార్కెట్ల నష్టాలకు తోడయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.57 వద్ద ట్రేడవుతోంది. ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలకు తాజాగా రూపాయి బలహీనత కూడా జత కలిసింది. పవర్ సెక్టార్ తప్ప మిగతా అన్ని సెక్టార్లు నష్టాల్లోనే ముగిశాయి.
Seasonal Diseases and Food: ఈ సీజన్‌లో ఈ ఫుడ్‌కు దూరంగా ఉండండి..!
సెన్సెక్స్ సూచీలో ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, ఎంఅండ్‌ఎం, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, టైటన్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.