భారత పర్యటనకు ఆస్ట్రేలియా ఎప్పుడు వచ్చినా పిచ్ నాణ్యత గురించి ఎక్కువ ఫోకస్ పెడుతుంది. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లు తయారు చేయడం వారిని కలవరపెడుతూ ఉంటుంది. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు రేపు (ఫిబ్రవరి 9) ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మొదటి టెస్టు జరగబోయే నాగ్‌పూర్ పిచ్‌పైనే అందరి దృష్టి నెలకొంది. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అలాగే ఆసీస్ సీనియర్ క్రికెటర్ స్మిత్‌తో పాటు టెక్నికల్ స్టాఫ్ ఒక్కరోజు ముందే పిచ్‌ను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ పిచ్ కూడా స్పిన్‌కు అనుకూలంగా ఉండబోతుందని.. ముఖ్యంగా లెఫ్ట్యాండ్ బ్యాటర్లకు చాలా కష్టమని ఆరోపించారు. తొలి మ్యాచ్ జరిగే నాగ్‌పుర్ పిచ్‌ను ఆతిథ్య జట్టు తమకు అనుకూలంగా మార్చుకుంటోందన్నారు.
Steve Smith thinks left-handers could have it particularly tough in Nagpur #INDvAUS pic.twitter.com/EudwrlHIRu
— cricket.com.au (@cricketcomau) February 7, 2023
“నాగ్‌పుర్ పిచ్‌పై వస్తున్న ఆరోపణలపై ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ సైమన్ ఓడానెల్ స్పందిస్తూ.. ఈ పిచ్ విషయంలో ఏదైనా సరైంది కాదని భావిస్తే.. ఐసీసీ జోక్యం చేసుకొని పరిశీలించాలి” అని అన్నాడు. అయితే, భారత్‌లో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ జరిగిన ప్రతిసారీ ఆతిథ్య జట్టుపై ఇలాంటి ఆరోపణలు చేయడం సహజమేనని పలువురు పేర్కొంటున్నారు. ఈ మేరకు భారత్ మాజీలు కూడా ఇటీవల కొన్ని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
Interesting treatment of the pitch in Nagpur. The groundstaff watered the entire centre of the surface & only the length areas outside the left-hander’s leg stump & then rolled only the centre, stopping short every time they got to the good length areas at both ends #IndvAus pic.twitter.com/Myr2ZblqCg
— Bharat Sundaresan (@beastieboy07) February 7, 2023
Also Read: INDvsAUS Test: తొలి టెస్టుకు అంతా సిద్ధం..నాగ్‌పూర్ పిచ్ రికార్డులపై ఓ లుక్కేద్దాం!