Site icon NTV Telugu

Rajasthan: ఇక్కడ ప్రసాదం దొంగిలిస్తే రోగాలు మాయం..

Untitled 3

Untitled 3

Srinath Ji Temple: సాధారణంగా మనం గుడిలో అయినా, ఇంట్లో అయినా దేవునికి పూజ చేసే సమయంలో నైవేద్యం సమర్పిస్తాం. అనంతరం ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం. ఇక గుడిలో అయితే దేవునికి సమర్పించిన నైవేద్యాన్ని అర్చకులు ప్రసాదంగా భక్తులకు పంచి పెడతారు. అలా దేవుని ప్రసాదం స్వీకరిస్తే అంత మంచిజరుగుతుందని ప్రజల నమ్మకం. అయితే రాజస్థాన్ లో మాత్రం దేవునికి నైవేద్యం సమర్పించిన తరువాత ఆ ప్రసాదాన్ని లూటీ చేసి ఆరగిస్తే శుభప్రదంగా భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని రాజ్ సమంద్ లో ఉన్న శ్రీనాథ్ జీ ఆలయంలో ప్రతి సంవత్సరం దీపావళి పండుగను జరుపుకున్న మరుసటి రోజున అన్నకూట్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా శ్రీనాథ్ జీకి, విఠల్ నాథ్ జీకి, లాలన్ కు భక్తులు నైవేద్యాలను సమర్పిస్తారు.

Read also:PM Modi in Jharkhand: జార్ఖండ్ పర్యటనలో ప్రధాని మోడీ.. పలు అభివృద్దికి పనులకు శంకుస్థాపన

ఆ నైవేద్యాన్ని రాత్రి 11 గంటల ప్రాంతంలో అక్కడి గిరిజనులు వచ్చి దోచుకుంటారు. ఎలా ఆ నైవేద్యాలను తీసుకుంటే సకల రోగాలు నయమవుతాయని ప్రజలు నమ్మకం. ఈ నేపథ్యంలో ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ.. దీపావళి పండుగను పురస్కరించుకున్న తరువాత.. ఆ మరుసటి రోజు అన్నకూట్ పండుగను ఘనంగా నిర్వహిస్తామని.. ఈ నేపధ్యంలో గ్రామ వాసులు వివిధ రకాల నైవేద్యాలను స్వామి వారికి సమర్పిస్తారని.. ఈ నేపథ్యంలో అక్కడి గిరిజనులు రాత్రి 11 గంటలకు వచ్చి ఆ నైవేద్యాలను దొంలిలిస్తారని.. అలా దొంగిలించిన నైవేద్యాలను తింటే సకల రోగాలు నయమవుతాయని ప్రజల నమ్మకం అని.. ఇలా గత 350 సంవత్సరాలుగా జరుగుతుందని వెల్లడించారు.

Exit mobile version