NTV Telugu Site icon

Jeevan Reddy: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్!

Jeevan

Jeevan

State Finance Corporation send notices to Jeevan Reddy: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. 20 కోట్ల రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని మామిడిపల్లిలోని ఆయన ఇంటికి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు అతికించారు. జీవన్ రెడ్డితో పాటు గ్యారెంటీ సంతకాలు పెట్టిన మరో నలుగురికి కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్ణీత సమయంలో రుణం చెల్లించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 2017లో తన భార్య పేరిట లోన్ తీసుకున్నారు. రూ. 20 కోట్ల రుణo తీసుకుని.. ఇప్పటివరకు ఒక్కపైసా కూడా వడ్డీ కట్టలేదు. వడ్డీ, లోన్ కట్టాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా జీవన్ రెడ్డి స్పందించలేదు. దాంతో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు మామిడిపల్లిలోని ఆయన ఇంటికి నోటీసులు అతికించారు. రుణం చెల్లించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: Viral Video: వెంటపడిన యువకుడికి చుక్కలు చూపించిన యువతి.. వీడియో వైరల్!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ డిపో పక్కన కోట్ల రూపాయల విలువైన స్థలం ఆర్టీసీకి ఉంది. ఆ స్థలాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కొందరు లీడర్లు లీజుకు తీసుకున్నారు. దానిని ఓ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద అప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన జీవన్ రెడ్డి తన సతీమణి పేరు మీద లీజుకు తీసుకున్నాడు. అక్కడ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 20 కోట్ల రుణంతో కాంప్లెక్స్ నిర్మించారు. దాని ద్వారా ప్రతి నెలా లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా.. ఆర్టీసీకి లీజు అగ్రిమెంట్ ప్రకారం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు. దాంతో ఆర్టీసీ అధికారులు బకాయుల కోసం చాలా సార్లు ఒత్తిడి తెచ్చారు. అయితే స్థానికంగా ఎమ్మెల్యే కావడంతో లీజు బకాయిల వసూలుకు అధికారులు వెనుకడుగు వేశారు. ఇప్పుడు ఆయన ఓడిపోవడంతో నోటీసులు పంపారు.