State Election Commission: ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ..

Municipal Elections

Municipal Elections

State Election Commission: ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదుపై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. హై కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం ఆర్డర్ జారీ చేసింది. మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా మున్సిపల్ పరిపాలనపై ప్రత్యేక జ్ఞానం లేదా అనుభవం ఉన్న వ్యక్తులు ఉంటారు. అయితే వారికి ఓటు హక్కు ఉండదు.. తాజాగా ఈసీ విడుదల చేసి సర్క్యులర్ ప్రకారం.. ఎమ్మెల్యేలు, లోక్ సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్‌అఫీషియో ఓటు వేయొచ్చు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు తమకు ఓటు ఉన్న మున్సిపాలిటీలోనే ఎక్స్‌అఫీషియో ఓటు వినియోగించుకోవచ్చునని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫీషియో ఓటు నమోదుకు ఈసీ అవకాశం ఇచ్చింది. అయితే.. ఇందుకు సంబంధించిన కొన్ని రూల్స్‌ను సైతం ఈసీ వివరించింది. ఎక్స్‌అఫీషియో సభ్యుడు మున్సిపల్ ప్రాంతంలో ఓటరుగా రిజిస్టర్ అయితేనే అర్హత ఉంటుంది. లోక్‌సభ ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అదేవిధంగా రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీలకు కూడా ఓటర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. అర్హత లేని సభ్యులకు ఓటు హక్కు ఉండదు. అర్హత లేకుండా వేసిన ఓటు చెల్లదని ఎన్నికల కమిషన్ తెలిపింది. అర్హత లేని వ్యక్తిని సభ్యుడిగా పరిగణించరు. రాజ్యాంగం ఆర్టికల్ 243-S(5) ప్రకారం ఏర్పడిన కమిటీల ఛైర్మన్లు మున్సిపాలిటీ పరిధిలో ఓటర్‌గా నమోదు అయి ఉండాలి.

READ MORE: Krishna Vamsi : సినిమా లేకపోతే మీకు బతుకే లేదు – రివ్యూయర్స్‌పై కృష్ణవంశీ ఫైర్..