Site icon NTV Telugu

Kuwait: కువైట్‌లో తొలిసారి ప్రారంభమైన హిందీ రేడియో ప్రసారం..

Kuwait

Kuwait

భారత్‌-కువైట్‌ మధ్య దౌత్యపరంగా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. కువైట్‌లో మొట్టమొదటి సారి హిందీ రేడియో ప్రసార కార్యక్రమం ప్రారంభమైందని భారత రాయబార కార్యాలయం ఇవాళ (సోమవారం) ఎక్స్‌ వేదికగా తెలిపింది. ప్రతి ఆదివారం FM 93.3, FM 96.3 ఫ్రిక్వెన్సీల్లో కువైట్‌లోని రేడియోల్లో ఇక నుంచి హిందీ కార్యక్రమాలు ప్రసారం కానున్నాయిని ప్రకటించింది. రేడియోలో హిందీ కార్యక్రమాలు ప్రసారం చేయడంపై కువైట్‌ సమాచార మంత్రిత్వ శాఖపై భారత రాయబార కార్యాలయం ప్రశంసలు కురిపించింది.

Read Also: Uddhav Thackeray: మేము 300 సీట్లకు పైగా గెలుస్తాం.. నా పార్టీనే ఒరిజినల్..

కాగా, కువైట్‌లో రేడియో ప్రసార కార్యక్రమం స్టార్ట్ చేయడం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా మెరుగు పర్చుకోవడంలో కీలకంగా మారబోతున్నాయి. కువైట్‌లో సుమారు 10 లక్షల మంది ప్రవాస భారతీయులు నివాసం ఉంటున్నారు. కువైట్‌ రిటైల్‌ మార్కెట్‌లో భారతీయ వ్యాపార కమ్యూనిటీ చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. 1961వ సంవత్సరం నుంచి భారత్‌- కువైట్‌కు ఒక ప్రధానమైన భాగస్వామ్య దేశంగా ఉంటుంది. 2021-2022 సంవత్సరానికి ఇరు దేశాల మధ్య దౌత్య పరమైన సంబంధాలు ఏర్పడి 60 ఏళ్లు పూర్తి కావొస్తుంది అని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

Exit mobile version