బుధవారం ఉదయం స్పేస్‌ఎక్స్ తన స్టార్‌షిప్ సూపర్ హెవీ రాకెట్ తొమ్మిదవ టెస్ట్ ఫ్లైట్‌ను ప్రారంభించింది. దక్షిణ టెక్సాస్‌లోని బోకా చికా బీచ్ సమీపంలోని కంపెనీ స్టార్‌బేస్ లాంచ్ సైట్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ మిషన్ భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైంది. ప్రపంచం దృష్టంతా ఈ ప్రయోగంపైనే కేంద్రీకృతమైంది. అయితే రాకెట్ విజయవంతంగా ప్రయోగించారు. కానీ ప్రయోగించిన కొంత సమయం తర్వాత స్టార్‌షిప్ నియంత్రణను కోల్పోయింది. దీని కారణంగా, అది భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే క్రాష్ అయ్యింది. ఈ మొత్తం పరీక్ష 1.06 గంటలు కొనసాగింది. భూమికి తిరిగి వచ్చే సమయంలో స్టార్‌షిప్ రాకెట్ పేలిపోయిందని స్పేస్‌ఎక్స్ ధృవీకరించింది. లోపాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది.
Also Read:Off The Record: ఏపీ బీజేపీలో ఏదేదో జరిగిపోతోందా..?
ఈ మిషన్‌కు ‘స్టార్‌షిప్ ఫ్లైట్ 9’ అని పేరు పెట్టారు. ఇందులో సూపర్ హెవీ బూస్టర్, షిప్ 35 ఉపయోగించారు. సూపర్ హెవీ బూస్టర్ గతంలో ఫ్లైట్ 7 లో ప్రయాణించింది. ఇది దాని రెండవ ఫ్లైట్. మునుపటి కొన్ని ఫ్లైట్లలో సాంకేతిక లోపాల కారణంగా మిషన్లు విఫలమయ్యాయి. కానీ ఈసారి ఫ్లైట్ అనేక ముఖ్యమైన మైలురాళ్లను దాటింది.
Also Read:TDP Mahanadu: అట్టహాసంగా మహానాడు.. ఆరు ప్రధాన అంశాలు సభ ముందుకు..
ఈ రాకెట్‌లో 33 రాప్టర్ ఇంజన్లు అమర్చారు. వాటిలో 29 ఇంజన్లు ఈ విమానంలో విజయవంతంగా ప్రారంభించారు. దీనితో పాటు, స్టార్‌షిప్ “హాట్-స్టేజింగ్” అనే ముఖ్యమైన ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేసింది. స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ ఈ స్టార్‌షిప్‌ను బహుళార్ధసాధక రాకెట్‌గా మార్చాలని భావిస్తున్నారు. ఇది మానవులను, వస్తువులను చంద్రుడు, అంగారక గ్రహం, అంతకు మించి తీసుకెళ్లగలదని ఆశిస్తున్నారు.
Hotstaging and sporty flip! 🙂
COME ON SHIP 35! pic.twitter.com/Tv1XcjSJfv
— NSF – NASASpaceflight.com (@NASASpaceflight) May 27, 2025
