NTV Telugu Site icon

Star Vanitha: ‘స్టార్‌ వనిత’ వచ్చేస్తోంది.. ఇక, టీవీ రిమోట్‌ అందుకోండి..

Star Vanitha

Star Vanitha

Star Vanitha: మహిళల కోసం ప్రత్యేకంగా మరో స్పెషల్‌ ప్రోగ్రామ్‌తో మీ ముందుకు వచ్చేస్తోంది వనిత టీవీ.. ఎప్పుడూ లేని విధంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన తొలి తెలుగు చానెల్‌ వనిత టీవీ కాగా.. ఇప్పటికే ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలతో అందరి అభిమానాన్ని పొందింది.. పొలిటికల్‌ న్యూస్‌, ఎంటైర్మెనెంట్‌, ఈవెంట్లు, వంటలు, ఫన్నీ ప్రోగ్రామ్స్‌, హెల్త్‌ ప్రోగ్రామ్స్‌, అవేర్‌నెస్‌ కార్యక్రమాలు, దిల్‌దార్‌ వార్తలు.. ఇలా ఎన్నో కార్యక్రమాలతో ఇంటిల్లిపాదిని ఎంటైర్‌టైన్‌ చేస్తూ వస్తున్న వనిత టీవీ ఇప్పుడు.. విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తోంది.. ఇక, ‘స్టార్‌ వనిత’ పేరుతో సరికొత్త కార్యక్రమంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది..

Read Also: Kalki 2898 AD : భారీ పాన్ ఇండియా మూవీ విడుదల వాయిదా పడనుందా..?

‘స్టార్‌ వనిత’ పేరుతో రూపొందిస్తున్న ఈ కార్యక్రమం.. సోమవారం నుంచ శుక్రవారం ప్రతీరోజూ ఈ కార్యక్రమం ప్రసారం చేయనున్నారు.. ఆగస్టు 7వ తేదీ నుంచి ఈ వనిత ఎంటైర్‌టైన్‌మెంట్‌ షో ప్రారంభం కానుంది.. ఇప్పటికే ఆ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసిన విషయం విదితమే కాగా.. కొందరు సెలక్ట్‌ చేసిన మహిళలతో వివిధ రకాల గేమ్స్‌ ఆడిస్తారు.. పాటలు పాడిస్తారు.. డ్యాన్స్‌లు చేయిస్తారు.. విజేతలకు బహుమతలు కూడా అందిస్తారు.. ఇక, ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్‌ శ్యామల నేతృత్వంలో నిర్వహిస్తోంది వనిత టీవీ.. ఆగస్టు 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రోగ్రామ్‌.. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతీరోజు 12 గంటలకు ప్రసారం కానుండగా.. ఆ సమయంలో మిస్‌ అయినవారి కోసం తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారం చేస్తారు.. ఇంకేముందు.. మహిళలు.. ఇక రిమోట్‌ అందుకోవాల్సిన సమయం వచ్చేసిందన్నమాట..

Show comments