Site icon NTV Telugu

Star Hospitals: సీనియర్ సిటిజెన్స్ కోసం స్టార్ సమ్మాన్ ప్రారంభం..

Star Hospitals

Star Hospitals

ఆగస్టు 21న జరుపుకునే ప్రపంచ సీనియర్ సిటిజెన్స్ డే సందర్భంగా, స్టార్ హాస్పిటల్స్ స్టార్ సమ్మాన్ – సీనియర్ సిటిజెన్స్ హెల్త్ ప్రివిలేజెస్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా వృద్ధులకు గౌరవప్రదమైన, ఆప్యాయమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలు అందించడంతో పాటు, ముందస్తు జాగ్రత్తలు (preventive care), ప్రారంభ దశలో వ్యాధులను గుర్తించే అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read:Judge Frank Caprio: ఈ జడ్జి చాలా స్పెషల్.. ఇక లేరంటూ కుటుంబం పోస్ట్..

ఈ సందర్భంగా స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. రమేశ్ గూడపాటి గారు మాట్లాడుతూ.. “మన సంస్కృతిలో మనం ఈరోజు ఉన్న స్థాయికి రావడానికి పెద్దలే కారణం. వారిని గౌరవించడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, అది మన కర్తవ్యమూ. స్టార్ సమ్మాన్ ద్వారా వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడం, అవసరమైతే సమయానికి సరైన చికిత్స అందించడం, అలాగే ప్రత్యేక రాయితీల ద్వారా వారి ఆర్థిక భారం తగ్గించడం మా ఉద్దేశ్యం. వృద్ధుల సంక్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధతో రూపొందించాం.” అన్నారు.

స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ సీఈఓ డా. రాహుల్ మెడక్కర్ గారు మాట్లాడుతూ..”స్టార్ హాస్పిటల్స్ ప్రత్యేకత – కుటుంబ విలువల ఆధారంగా పనిచేయడం. మా సీనియర్ సిటిజెన్స్ అనేవారు రోగులు మాత్రమే కాదు, వారు తల్లిదండ్రులు, మార్గదర్శకులు, ప్రేరణల మూలం. స్టార్ సమ్మాన్ ద్వారా ప్రత్యేక హెల్ప్‌డెస్క్, హెల్ప్‌లైన్, రాయితీలు మాత్రమే కాకుండా, వృద్ధులను సలహాదారులుగా మా కమిటీలో భాగస్వాములను చేస్తాం. ఇంటి దగ్గరే చికిత్స కోరుకునేవారికి తక్కువ ఖర్చుతో హోమ్ కేర్ సదుపాయాలు కూడా అందిస్తాం. మా లక్ష్యం – వృద్ధులు గౌరవం పొందేలా, ఆప్యాయతతో చూసుకునేలా, ఆసుపత్రి సేవల్లో భాగస్వాములు కావాలన్న భావన కలిగేలా చూడడం.” అన్నారు.

Also Read:Nara Rohith : టీడీపీ అధికారంలో ఉంటేనే సినిమాలు.. నారా రోహిత్ క్లారిటీ

హైదరాబాద్‌లో అగ్రగామి మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిగా నిలిచిన స్టార్ హాస్పిటల్స్, అత్యాధునిక వైద్య సాంకేతికత, నైపుణ్యం, రోగి-కేంద్రిత సేవలతో ప్రసిద్ధి చెందింది. నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తరించిన స్టార్ హాస్పిటల్స్, ఆరోగ్యాన్ని మరింత దయతో, సమగ్రంగా, అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉంది.

Exit mobile version