NTV Telugu Site icon

Unstoppable: స్టార్ హీరోతో బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’..

Balayya

Balayya

బాలయ్య ‘అన్‌ స్టాపబుల్’ టాక్ షో ఎంతో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ షోలో ప్రముఖ హీరోల నుంచి మొదలు పెట్టి పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఇంతకుముందు.. మొదటి, రెండు సీజన్లు ఈ షో ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నడిచి భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే దసరా కానుకగా మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. హీరో దుల్కర్ సల్మాన్ తన ‘లక్కీ భాస్కర్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘అన్‌ స్టాపబుల్’ షోకి వచ్చాడు. ఈ రోజే దుల్కర్ సల్మాన్ తో ఎపిసోడ్ ని చిత్రీకరణ చేస్తున్నారు.

Read Also: Hezbollah Deputy: ఇజ్రాయెల్‌తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం..

ఈ ఎపిసోడ్‌లో దుల్కర్ సల్మాన్‌తో పాటు డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ తదితరులు పాల్గొంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో.. బాలయ్య వారితో సరదాగా ముచ్చటిస్తున్నారట. బాలయ్య మాటలు, పంచ్‌లు ఏ విధంగా ఉంటాయో ఫ్యాన్స్‌కు తెలుసు.. మరి వీరికి ఎలాంటి పంచ్‌లు వేస్తారు.. ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టబోతున్నారో ఇంట్రస్టింగ్‌గా మారింది. లక్కీ భాస్కర్ చిత్రం విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు.

Read Also: RK Roja: సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు..

Show comments