NTV Telugu Site icon

Kakinada: కుడా ఛైర్మన్‌ ప్రమాణ స్వీకారోత్సవంలో అపశృతి.. కుప్పకూలిన స్టేజ్

Stage Collapse

Stage Collapse

Kakinada: కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా-KUDA) ఛైర్మన్ తుమ్మల బాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. పరిమితికి మించి అధికంగా స్టేజ్‌పైకి జనం చేరడంతో ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది. స్టేజ్‌పై ఉన్న టీడీపీ నేతలు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, జనసేన నేతలు పంతం నానాజీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్, తుమ్మల బాబు ఒక్కసారిగా కిందపడిపోయారు. వేదిక అంత ఎత్తేమీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన అనంతరం ప్రమాణ స్వీకారోత్సవం యథావిధిగా కొనసాగింది. స్టేజ్ కూలిన వీడియో వైరల్‌గా మారింది.

 

Show comments