మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. మధ్యప్రదేశ్ సర్కార్ రైతులు, నిరుద్యోగులు, మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పిదంటూ కాంగ్రెస్ నిరసన చేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ ముట్టడికి వారు ప్రయత్నించారు. బారీకేడ్లను తొలగించుకుని దూసుకెళ్లడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు.ఈ క్రమంలో వాటర్ కెనాన్లను పోలీసులు ప్రయోగించి. దీంతో.. తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది.
Read Also: Kannppa: ‘కన్నప్ప’ ప్రేమ పాట.. ప్రీతి ముకుందన్’తో విష్ణు రొమాన్స్!
మరోవైపు.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేస్తున్న నిరసనలో వేదిక కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కాంగ్రెస్ నాయకులకు గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మేంద్ర సింగ్ చౌహాన్ సహా గాయపడిన వారిని అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ మాట్లాడుతూ.. పార్టీ నాయకులు రంగమహల్ స్క్వేర్ సమీపంలో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ వైపు కవాతు చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపారు.
Read Also: Crime: బీజేపీ నాయకుడి భార్య దారుణ హత్య.. గొడ్డలితో నరికి చంపిన దుండగుడు