Site icon NTV Telugu

SSMB29: రాజమౌళి లీక్ స్ట్రాటజీ మాములుగా లేదుగా.. ‘సంచారి’ సాంగ్ వెనక మైండ్ గేమ్..?

Ssmb 29

Ssmb 29

SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘SSMB 29’ సినిమా చుట్టూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈవెంట్‌కు ఇంకో మూడు రోజులు మాత్రమే ఉండగా, రాజమౌళి మాత్రం తనదైన ప్రమోషన్ స్టైల్ ప్రారంభించాడు. నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా టైటిల్ రివీల్ ఈవెంట్ జరగనుండగా.. అంతకుముందే ‘సంచారి’ పేరుతో పాటను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. శృతిహాసన్, కాలభైరవ కలిసి ఆలపించిన ఈ పాటకు సంగీత మాస్ట్రో కీరవాణి సంగీతం అందించారు. చైతన్య ప్రసాద్ రాసిన ఈ సాహిత్యం మొత్తం శివతత్వం, యాత్ర, ఆధ్యాత్మిక ఆవేశం చుట్టూ తిరుగుతుంది. ఇది కేవలం ప్రమోషనల్ సాంగ్ మాత్రమేనా లేక సినిమాలో భాగమా అన్న సందేహం అందరిలోనూ మొదలైంది. అయితే సాహిత్యం ప్రకారం ఇది కథకు దగ్గరగా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Rocking Rakesh : కేసీఆర్ సినిమాపై దుష్ప్రచారం.. వీడియో రిలీజ్ చేసిన రాకింగ్ రాకేష్

జక్కన్న ప్లాన్ ఏమిటి?
రాజమౌళి ఎప్పుడూ తన సినిమాలకు కొత్తగా ప్రమోషన్ ప్లాన్ చేస్తాడు. ఈసారి కూడా అదే జరిగింది. నవంబర్‌లో అప్డేట్ ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, ఇప్పుడు ఒక్కొక్కటిగా టీజర్లు, స్టిల్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తున్నాడు. హీరో లుక్, టైటిల్ నవంబర్ 15న రివాల్వ్ చేయనున్నాడు. ఈ ఈవెంట్‌లో 100 అడుగుల డిజిటల్ స్క్రీన్‌పై టైటిల్‌ను ప్రకటించనున్నారని సమాచారం. ఇకపోతే ఫస్ట్ లుక్‌లో మహేష్ మెడలో త్రిశూలం, డమరుకం ఉన్న లాకెట్ చూపించారు. ఇది మైథలాజికల్ టచ్ ఉందని చెప్పడానికి సంకేతమని ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు రాజమౌళి ఉపయోగించిన #GlobeTrotter హాష్‌ట్యాగ్ వైరల్ అవుతోంది. సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో పాన్ ఇంటర్నేషనల్ మూవీగా రూపొందుతుండటంతో ‘గ్లోబ్ ట్రాటర్’ టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

School Bus Fire: నార్సింగిలో ప్రైవేట్ స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు..

‘రుద్ర’, ‘వారణాసి’, ‘సంచారి’ వంటి పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే సంచారి అన్న పదం అన్ని భాషల్లో వాడేందుకు సౌకర్యవంతం కాకపోవడంతో గ్లోబల్ మార్కెట్ దృష్ట్యా ‘గ్లోబ్ ట్రాటర్’ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ టాక్. మహేష్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్ రానుందని అభిమానులు భావించగా.. రాజమౌళి మాత్రం మెడలో లాకెట్ పోస్టర్ విడుదల చేసి సస్పెన్స్ పెంచాడు. ఇప్పుడు 15న హీరో లుక్‌తో పాటు గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రాజమౌళి మరోసారి తన ప్రమోషనల్ స్కిల్స్‌తో అభిమానుల అంచనాలను మించి వెళ్లిపోయాడు. ఇప్పటికే మహేష్, ప్రియాంక చోప్రా వీడియోతో ఈవెంట్ హైప్ సృష్టించిన జక్కన్న, ఇప్పుడు ‘సంచారి’ సాంగ్‌తో కొత్త బజ్ తెచ్చాడు. 15న రామోజీ ఫిలిం సిటీలో జరిగే ఈవెంట్‌పై దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టి సారించింది.

Exit mobile version