Vijayendra Prasad Gives SSMB 29 Shooting Update: ఏ క్షణమైనా ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా నుంచి అప్టేడ్ రావొచ్చని.. చాలా కాలంగా మూవీ లవర్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. అదిగో ఇదిగో అని ఊరించడం తప్ప.. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే క్యాస్టింగ్ ఎవరనేది కూడా తెలియదు. ఎస్ఎస్‌ఎంబీ 29 ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతుందని ముందునుంచి జక్కన్న చెబుతు వస్తున్నారు. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఇదే చెబుతూ వస్తున్నారు.
ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడినట్టుగా విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఎస్ఎస్‌ఎంబీ 29 ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. మహేష్-రాజమౌళి మూవీ 2025 జనవరిలో సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు తెలిపారు. తాజాగా ఆయన ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొనగా.. ఎస్ఎస్‌ఎంబీ 29 గురించి అడగ్గా జనవరిలో చిత్రీకరణ మొదలువుతుందని చెప్పారు. ప్రస్తుతం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. ఇప్పటికే లాంగ్ హెయిర్, భారీ గడ్డంతో మహేష్ కనిపిస్తున్నారు. అలాగే బాడీ బిల్డ్ చేసే పనిలో కూడా పడ్డారు.
Also Read: Ratan Tata: ఆమె కోసమే భారత్‌కు తిరిగివచ్చిన రతన్ టాటా!
ప్రీ ప్రొడక్షన్ వర్క్ డిసెంబరు వరకు పూర్తి చేసి.. వచ్చే జనవరిలో సినిమా షూటింగ్ మొదలుపెట్టన్నారట. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్ ఎప్పుడు? అనేది చెప్పడం మాత్రం కష్టం. ఎందుకంటే.. జక్కన్న గురించి అందరికీ తెలిసిందే. షూటింగ్‌కే ఏళ్లకు ఏళ్ల సమయాన్ని తీసుకుంటారు. మరి ఎస్ఎస్‌ఎంబీ 29 ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. హాలీవుడ్ నటులు ఇందులో భాగం అయ్యే అవకాశాలు ఉన్నాయి.