Site icon NTV Telugu

SSMB 29: ఇక పాన్ ఇండియా కాదయ్యా.. పాన్ వరల్డ్ అనాలేమో! ఏకంగా 120 దేశాలలో రిలీజ్?

Ssmb 29

Ssmb 29

SSMB 29: భారతీయ సినీప్రేక్షకులతో పాటు వివిధ దేశాలలో ఉన్న మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ SSMB 29. సూపర్‌స్టార్ మహేష్ బాబు, అంతర్జాతీయ గుర్తింపు పొందిన దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మల్టీ–స్టారర్ యాక్షన్ అడ్వెంచర్‌కి సంబంధించిన మొదటి బిగ్ రివీల్ నవంబర్ 2025లో రానున్న విషయం తెలిసిందే.

Kieron Pollard: 6,6,0,6,6,6,6,6 .. 8 బంతుల్లో 7 సిక్సర్లు.. మాజీ ఆల్‌రౌండర్ ఊచకోత!

ఇకపోతే రాజమౌళి టీమ్ ఇప్పటికే కెన్యాలో కీలక సన్నివేశాల కోసం లొకేషన్ స్కౌటింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర టీం కెన్యా విదేశీ వ్యవహారాల మంత్రి ముసాలియా ముడవాడిని కలిశారు. దర్శకుడు రాజమౌళిని ఆయన.. దూరదృష్టి ఉన్న విజనరీ దర్శకుడు అంటూ కితాబిచ్చాడు. అంతేకాకుండా, ఆఫ్రికా ఖండంలో కోట్లాది హృదయాలను గెలుచుకున్న వ్యక్తి అంటూ ప్రశంసించారు. అలాగే కెన్యా దేశంలోని అందాలను ప్రపంచానికి చూపించబోతుండడంతో చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

Kadapa: వినాయకుడి విగ్రహంపై రప్పా.. రప్పా..!

ఆ తర్వాత మంత్రి తన ట్వీట్‌లో ఒక భారీ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే.. ‘SSMB 29’ 120 దేశాల్లో విడుదల కానుందని. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకీ లభించని ఈ రిలీజ్, షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ రికార్డును కూడా బద్దలు కొట్టనుంది. రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ని ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టే తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్లోబల్ ట్రాట్టింగ్ యాక్షన్ అడ్వెంచర్‌లో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లెజెండరీ నిర్మాత కె.ఎల్. నారాయణ తన దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ బిగ్ బడ్జెట్ ఎంటర్టైనర్‌ ను నిర్మిస్తుండగా, ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version