NTV Telugu Site icon

SS Thaman: ట్రోలర్స్ ను చూస్తుంటే సిగ్గుగా ఉంది!

Ss Thaman

Ss Thaman

డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో సంగీత దర్శకుడు తమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు మాట్లాడడం సినిమా గురించి మాట్లాడకుండా ట్రోలర్స్ గురించి స్పీచ్ మొదలుపెట్టారు. తెలుగు సినిమాని ట్రోల్ చేస్తున్న ట్రోలర్స్ ని చూస్తుంటే భయంగా ఉందని అదేవిధంగా సిగ్గుగా ఉందని ఆయన కామెంట్ చేశారు. ఎప్పటినుంచో ఉన్న లెగసీ కంటిన్యూ చేస్తూ ఇప్పుడు తెలుగు సినిమా ఫ్లయింగ్ హై జోన్ లో ఉందని షైన్ అవుతుందని అన్నారు.. ఇలాంటి సందర్భంలో తెలుగు సినిమాని కాపాడడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. అంతేకాకుండా నిర్మాత బాగుండాలని సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ కోరుకోవాలని ఆయన అన్నారు.

READ MORE: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌ని రక్షించిన ఆటో డ్రైవర్ “భజన్ సింగ్ రాణా”.. ఘటన గురించి ఏమన్నారంటే..

సినిమాలకు సంబంధించిన ట్రోలింగ్ చూస్తుంటే భయంగా ఉందని అదే సమయంలో సిగ్గుగా కూడా ఉందని ఆయన అన్నారు. నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోతుంది అని పేర్కొన్న తమన్ ప్రతి హీరో ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి ప్రతి హీరో ఫ్యాన్ కి ఎంతో బాధ్యత ఉందన్నారు. తెలుగు సినిమాల మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దు అని ఆయన కోరారు. తాను బాలీవుడ్ మలయాళ కన్నడ సినీ పరిశ్రమలకు వెళ్ళినప్పుడు అక్కడివారు ఏదైనా మంచి తెలుగు సినిమా చేయాలని అంటూ ఉంటారని, కానీ మనవాళ్ళకేమో తెలుగు సినిమాలంటే చులకన అంటూ ఆయన కామెంట్ చేశారు. తెలుగు సినిమాకి ఇతర భాషల్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎంతో గౌరవం వుంది, ఎందుకంటే మన తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా నలు దిశలా వ్యాప్తి చెందారని ఆయన అన్నారు. ట్రోల్స్ తో మన పరువుని మనమే తీసుకోవద్దు అని అంటూ తమన్ వ్యాఖ్యానించారు.