Varanasi :మెక్సికోలో రాజమౌళి మేజిక్ షురూ.. CCXP వేదికపై ‘వారణాసి’ ఎక్స్‌క్లూజివ్ గ్లింప్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ సినిమా వేదికపై ఇప్పుడు అందరి కళ్లు దర్శకధీరుడు రాజమౌళి వైపు ఉన్నాయి. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘వారణాసి’ (SSMB29) బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో, ఈ సినిమా తన మొదటి అంతర్జాతీయ అడుగును మెక్సికోలో వేయబోతోంది.
మెక్సికో సిటీలో జరుగుతున్న CCXP MX 2026 వేదికపై ఏప్రిల్ 24న (రేపు) ‘వారణాసి’ టీమ్ ఒక స్పెషల్ ప్యానెల్‌ను నిర్వహించబోతోంది. థండర్ స్టేజ్ (Thunder Stage) పై జరగబోయే ఈ ఈవెంట్‌లో “వారణాసి టు ద వరల్డ్” (Varanasi to the World) అనే పేరుతో ఒక ఎక్స్‌క్లూజివ్ గ్లింప్స్‌ను ప్రదర్శించనున్నారు. రాజమౌళి కుమారుడు, నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ ఈ కార్యక్రమంలో పాల్గొని గ్లోబల్ ఆడియన్స్‌తో ముచ్చటించనున్నారు. షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి, ఈ ఈవెంట్ కోసం ఒక ప్రత్యేకమైన వీడియో మెసేజ్‌ను పంపారు. ఇందులో సినిమాకు సంబంధించిన ఇప్పటివరకు ఎవరూ చూడని కొన్ని ఆసక్తికరమైన విషయాలను, తన విజన్‌ను ఆయన పంచుకోబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అంటార్కిటికా వంటి అరుదైన ప్రదేశాల్లో జరగడం, విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీ బడ్జెట్ కేటాయించడం వంటి వార్తలు సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి.
Also Read
Hola Mexico… 🇲🇽#VARANASI makes its first global appearance at #CCXPMX26 with an exclusive panel on April 24 at the Thunder Stage.
We will be showcasing our “Varanasi to the World” glimpse on the big stage…
An exclusive video message from @ssrajamouli and never seen before… pic.twitter.com/AUPyzcjNB0
— Varanasi (@VaranasiMovie) April 23, 2026
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!