Site icon NTV Telugu

SS Rajamouli: నేడు దర్శకధీరుడు రాజమౌళి పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

Ss Rajamouli

Ss Rajamouli

SS Rajamouli: టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన వారిలో మొదటగా చెప్పుకొనే పేరు దర్శకధీరుడు రాజమౌళి. నేడు ఆయన 52వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ ఫోటోతో రాజమౌళికి విషెస్ తెలిపారు. మహేష్ బాబు ఈ ఫోటోను పంచుకుంటూ.. ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక్క దర్శక ధీరుడు రాజమౌళి.. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ అద్భుతాలే అంటూ.. మీ నుంచి మరో అద్భుతం త్వరలోనే రాబోతుంది అని మహేష్ బాబు రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు.

Bunny Vas : ‘మిత్ర మండలి’ ప్రమోషన్ వేడుకలో.. బండ్ల గణేష్ బన్నీ వాస్ ఘర్షణ?

మరోవైపు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజమౌళికి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు జక్కన్న అంటూ ‘లోడ్స్ ఆఫ్ లవ్’ అండ్ తన ట్విట్టర్ అకౌంట్లో విశేష్ తెలిపాడు. అలాగే రామ్ చరణ్ తేజ కూడా దర్శక ధీరుడు రాజమౌళికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మా రోజుల్లో అతిపెద్ద ఫిలిం మేకర్, దగ్గరి వ్యక్తి అయిన రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ విషెస్ తెలిపారు.

S*exual Assault: 13 ఏళ్ల బాలికపై 75 సంవత్సరాల ఆలయ పూజారి లైంగిక వేధింపులు

Exit mobile version