Kadubandi Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల మార్పు, చేర్పుల వ్యవహారం కాకరేపుతోంది.. ఇదే సమయంలో.. కొన్ని నియోజకవర్గాల్లో సీఎం జగన్ కావాలి.. కానీ, మా ఎమ్మెల్యే వద్దు అంటూ ఆందోళనలు చేసేవాళ్లు లేకపోలేదు.. మరికొందరు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తు్న్నారు. అయితే, ఈ రోజు విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణతో శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు.. బొత్స ఝాన్సీ కి విశాఖపట్నం లోక్‌సభ టికెట్ కేటాయిస్తారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో.. శుభాకాంక్షలు చెప్పడానికే వచ్చానని తెలిపారు.. ఇక, తనపై అసమ్మతి నేతల తిరుగుబాటుపై స్పందించిన ఎస్.కోట ఎమ్మెల్యే కడిబండి శ్రీనివాసరావు.. కష్టపడి పని చేసే వారికే అధిష్టానం టిక్కెట్లు ఇస్తుందన్నారు. నా మీద ఫిర్యాదు చేసేవారు ఏదో ఆశించి చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ అయినా మరే నాయకుడు అయినా వాళ్లు ఏదో ఆశిస్తున్నారని తెలిసిందన్నారు. నన్ను గెలిపించాలని ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బా రెడ్డి చెప్పారని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా.. తాను బాగా పని చేస్తున్నానని.. నీ పని నువ్వు చేసుకో అని హామీ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ఫైనల్ గా అందరూ పార్టీకి కట్టుబడి పనిచేయాల్సిందే.. మరోసారి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు.
Read Also:India Maldives Row: మాల్దీవుల రాయబారిని పిలిచిన భారత ప్రభుత్వం