పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా సలార్.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా సినీ అభిమానులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. మొన్నటివరకు మోస్ట్ అవైటెడ్ మూవీగా యానిమల్ ఉండేది ఆ ఇప్పుడు రిలీజ్ అయ్యి థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు అందరి చూపు సలార్ వైపే ఉంది.. ఈ సినిమాను కేజీఎఫ్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు…
ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సలార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ లో శృతి హాసన్ తో పాటు మరో హీరోయిన్ కూడా కనిపించింది ఆమె ఎవరో తెలుసా..? ట్రైలర్ లో కనిపించిన ఈ హీరోయిన్ ను గుర్తుపట్టరా.? ఆమె పేరు శ్రియా రెడ్డి. యాంకర్ గా వీడియో జాకీగా చేసి ఆతర్వాత సినిమాల్లోకి వచ్చింది ఈ అమ్మడు. తమిళ్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.
తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ అమ్మడు సుపరిచితురాలే.. తెలుగులో 2003లో వచ్చిన అప్పుడప్పుడు, 2006లో వచ్చిన అమ్మ చెప్పింది అనే సినిమా నటించింది.. ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు.. తమిళ్, మలయాళంలో సినిమాలు చేసి ఆకట్టుకుంది. రీసెంట్ గా సుడల్: ది వొర్టెక్స్ అనే తెలుగు వెబ్ సిరీస్ లో నటించింది. ఇక ఇప్పుడు సలార్ లో నటిస్తుంది. ఈ మూవీలో కీలక పాత్రలో ఆమె కనిపించనుంది. ఇక సలార్ లో ఆమె పృథ్వీరాజ్ సుకుమారన్ భార్యగా కనిపిస్తుందని తెలుస్తోంది. సలార్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ్, మలయాళ , కన్నడ, హిందీ భాషల్లో సలార్ రిలీజ్ కాబోతుంది..