సెప్టెంబరు 18వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇప్పటికే ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకల్లో సామాన్య భక్తులకు పెద్దపీఠ వేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 18 నుంచి 26వ తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 17వ తారీఖు ఆదివారం నాడు అంకురార్పణ- రాత్రి 7 నుంచి 8 గంటల వరకు జరుగనున్నాయి. ఇక, 18 నాడు సోమవారం రోజు బంగారు తిరుచ్చి ఉత్సవం-మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగనున్నాయి. ధ్వజారోహణం(మీన లగ్నం) – సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల వరకు జరుగుతాయి. పెద్దశేష వాహనం – రాత్రి 9 నుంచి 11 గంటల వరకు కొనసాగుతుంది.
Read Also: Salaar : సలార్ మూవీ విడుదల అయ్యేది అప్పుడేనా..?
19వ తారీఖున మంగళవారం నాడు చిన్నశేష వాహనం – ఉదయం 8 నుంచి 10 గంటలకు వరకు.. అలాగే స్నపనతిరుమంజనం – మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు.. హంస వాహనం – రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరుగనున్నాయి. ఇక, 20వ తారీఖు బుధవారం రోజు సింహ వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.. స్నపనతిరుమంజనం – మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు.. ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు కొనసాగనున్నాయి.
Read Also: Uday Kotak: కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా
21తేది గురువారం నాడు కల్పవృక్ష వాహనం – ఉదయం 8 నుంచి 10 గంటలకు వరకు.. సర్వభూపాల వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగుతాయి. 22తారీఖు శుక్రవారం నాడు మోహినీ అవతారం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.. గరుడసేవ – రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతాయి.. శనివారం 23వ తారీఖు నాడు-హనుమంత వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు కొనసాగుతాయి. స్వర్ణరథం – సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు.. గజ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగనున్నాయి.
Read Also: DA Hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏకంగా రూ.27,000 పెరగనున్న జీతం?
ఇక 24వ తారీఖు – ఆదివారం రోజున – సూర్యప్రభ వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.. స్నపనతిరుమంజనం – మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు.. చంద్రప్రభ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగుతాయి. 25 తేది సోమవారం నాడు- రథోత్సవం- ఉదయం 6.55 గంటలకు.. అశ్వ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు కొనసాగనున్నాయి. 26తారీఖు మంగళవారం రోజు పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం – ఉదయం 3 నుండి 6 గంటల వరకు కొనసాగనున్నాయి. స్నపనతిరుమంజనం, చక్రస్నానం – ఉదయం 6 నుండి 9 గంటల వరకు.. ధ్వజావరోహణం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగుతాయి.