Site icon NTV Telugu

TTD : నేడు తిరుమలలో రెండో రోజు బ్రహ్మోత్సవాలు

Ttd

Ttd

ఏడు కొండల శ్రీవెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. రెండు సంవత్సరాల తరువాత మళ్లీ శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించేందుకు టీటీడీ పూనుకుంది. అయితే.. ఈ నేపథ్యంలో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలకు భక్తులు భారీగా పోటెత్తారు. అయితే నేడు రెండో రోజు తిరుమలలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అయితే వేకువ జామునుంచే స్వామివారికి సుప్రభాతసేవ మొదలు వివిధ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే.. ఉదయం 8గంటలకు స్వామివారి అమ్మవారితో కలిసి చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

 

అలాగే సాయంత్రం 7 గంటలకు హంస వాహనంపై భక్తులకు అమ్మవారితో కలిసి శ్రీవారు ఊరేగింపు భక్తులకు సాక్ష్యాత్కరం ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. ఏపీ సీఎం జగన్‌ తిరుమలలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరకున్న సీఎం జగన్‌ నేడు శ్రీవారిని దర్శించుకోనున్నారు. అంతేకాకుండాకు పెద్దశేష వాహన సేవలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు.

 

Exit mobile version