Srivani Trust: శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం (శ్రీవాణి) ట్రస్ట్‌కు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సనాతన ధర్మప్రచారంలో భాగంగా మారుమూల ప్రాంతాలలో శ్రీవారి ఆలయాలు నిర్మించడం, మతమార్పిడులను అరికట్టడం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అర్చక శిక్షణ లాంటి కార్యక్రమాల కోసం టీటీడీ ఈ ట్రస్ట్‌ను ప్రారంభించిన విషయం విదితమే కాగా.. ట్రస్ట్ ప్రారంభించిన నాలుగు సంవత్సరాల కాలంలోనే వెయ్యి కోట్లుకు చేరుకున్నాయి భక్తుల విరాళాలు..
Read Also: G20 Summit: మోడీ-బైడెన్ ద్వైపాక్షిక సమావేశం.. స్పష్టం చేసిన వైట్‌హౌజ్
2018 ఆగస్టులో శ్రీవాణి ట్రస్ట్ ను ప్రారంభించారు.. 2019 అక్టోబర్ నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది శ్రీవాణి ట్రస్ట్.. అప్పటి నుంచి అక్రమంగా దాతల సంఖ్య.. విరాళాలను పెంచుకుంది శ్రీవారి ట్రస్ట్.. 2019లో 26.25 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు 19,737 మంది భక్తులు.. ఇక, 2020లో 70.21 కోట్లు విరాళంగా సమర్పించారు 49,282 మంది భక్తులు.. మరుసటి ఏడాది అంటే.. 2021లో 176 కోట్లు విరాళంగా అందించారు లక్షా 31 వేల మంది భక్తులు.. అదే 2022 ఏడాదికి వచ్చేసరికి రూ.282.64 కోట్లు విరాళంగా అందించారు 2.70 లక్షల మంది భక్తులు.. ఇక, 2023లో ఇప్పటి వరకు రూ.268.35 కోట్లు విరాళంగా అందించారు లక్షా 58 వేల మంది భక్తులు.. ఇలా నాలుగేళ్ల కాలంలోనే వెయ్యి కోట్లు విరాళంగా వచ్చాయి. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 176 పురాతన ఆలయాల పునఃరుద్ధరణ చర్యలను ప్రారంభించింది టీటీడీ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలో 2273 నూతన ఆలయాల నిర్మాణాలు ప్రారంభిస్తోంది.. ఇక, 501 ఆలయాలకు ధూపధీప నైవేథ్యం కింద ప్రతి నెల 5 వేల చొప్పున చెల్లిస్తూ వస్తుంది టీటీడీ.