Sritej Health Bulletin : డిసెంబర్ 4న పుష్ప 2 (ది రూల్) ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన 13 ఏళ్ల శ్రీతేజ్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడిల్స్‌లో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం సాయంత్రం, ఆసుపత్రి అధికారులు శ్రీతేజ్ ఆరోగ్యం గురించి తాజా బులెటిన్‌ను విడుదల చేశారు. వెంటిలేటర్ సహాయం లేకుండా ఊపిరి పీల్చు కోగులుగుతున్నాడని వైద్యులు వెల్లడించారు. అప్పుడప్పుడు శ్రీతేజ కళ్ళు తెర్వగలుతున్నాడని, కానీ ఐ కాంటాక్ట్ చెయ్యలేకపోతున్నాడని వైద్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యులను గుర్తుపట్టడం లాంటివి చెయ్యడం లేదని వారు పేర్కొన్నారు.
Ismail Haniyeh: ‘‘హనియేకు పట్టిన గతే హౌతీలకు’’.. హనియే హత్యని అంగీకరించిన ఇజ్రాయిల్..
సైగలను గమనిస్తున్నాడు… కానీ మాటలను అర్థం చేసుకోలేక పోతున్నాడన్నారు. ఫుడ్ నీ ట్యూబ్ ద్వారా తీసుకుంటున్నాడని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ తల్లి రేవతి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో A1 నుంచి A18 వరకు నిందితుల జాబితాను కూడా వెల్లడించారు. తాజాగా దిల్ రాజు కూడా శ్రీతేజ పరామర్శించారు. రేవతి కుటుంబానికి అండగా ఉంటామని, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు దిల్ రాజు.
Kunamneni Sambasiva Rao: సంధ్య థియేటర్ ఘటనను రాజకీయం చేయడం తగదు..