Site icon NTV Telugu

Srinivasr Rao: డీహెచ్గా శ్రీనివాసరావు రిలీవ్.. హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్లు

Dh Relive

Dh Relive

ఈరోజు (బుధవారం) డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్గా డాక్టర్ శ్రీనివాసరావు రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ రవీంద్ర నాయక్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో.. శ్రీనివాసరావు కార్యాలయం నుండి వెళ్తుండగా కొందరు డాక్టర్లు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయనను హత్తుకుని డైరెక్టర్ కార్యాలయంలో పని చేసిన ఉద్యోగులు, సిబ్బంది ఏడ్చారు. కోవిడ్ కట్టడిలో సమర్థవంతంగా పని చేశారు అంటూ శ్రీనివాసరావుతో కన్నీటి పర్యంతమయ్యారు. కాగా.. ఆయన గుర్తుగా డాక్టర్ శ్రీనివాసరావుతో ఫొటోలు దిగేందుకు ఉద్యోగులు, డాక్టర్లు ఎగబడ్డారు.

K.A Paul: మోడీని చిత్తుచిత్తుగా ఓడిస్తా.. పాల్ సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీగా ఐపీఎస్, ఐఏఎస్ లకు పదోన్నతులు, బదిలీలు, స్థానచలనం చేస్తున్నారు. ఈ క్రమంలో.. శ్రీనివాసరావు స్థానంలో డాక్టర్ రవీంద్ర నాయక్ ను హెల్త్ డైరెక్టర్ గా నియమించింది. కాగా.. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా డాక్టర్ రమేశ్ రెడ్డి స్థానంలో త్రివేణిని నియమించింది.

Punjab: గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్ సింగ్ ఎన్‌కౌంటర్‌లో మృతి..

Exit mobile version