Site icon NTV Telugu

ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌లో సూపర్ ‘హిట్’ యాక్టర్ శ్రీనాథ్ మాగంటి

Ene2

Ene2

టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) సినిమాకు సీక్వెల్ వస్తుందనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది, కానీ తాజాగా దర్శకుడు తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చింది. మొదటి భాగంలో ‘కార్తీక్’ పాత్రలో మెప్పించిన నటుడు సుశాంత్ రెడ్డి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీక్వెల్‌లో నటించడం లేదని తరుణ్ వెల్లడించాడు. ఈ విషయం తనను ఎంతో బాధించిందని, అసలు సుశాంత్ లేకుండా సినిమా అదే ఫీల్ ఇస్తుందా అని తనే స్క్రిప్ట్‌ను మళ్ళీ విశ్లేషించుకున్నానని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ కథ తన సొంత స్నేహాల నుండి పుట్టినదని, అందుకే ఆ ప్రామాణికతతోనే ముందుకు వెళ్తున్నానని చెప్పారు. సుశాంత్ లేకపోయినా సినిమాలో కార్తీక్ ప్రయాణం మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Also Read : Faria Abdullah : యంగ్ కొరియోగ్రాఫర్‌తో ఫరియా అబ్దుల్లా డేటింగ్!

ఇదే సమయంలో ‘హిట్’ ఫ్రాంచైజీ, ‘లక్కీ భాస్కర్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు శ్రీనాథ్ మాగంటి ఈ సీక్వెల్‌లో ఒక ప్రధాన పాత్ర పోషించబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సుశాంత్ ప్లేస్‌లో శ్రీనాథ్ ‘కార్తీక్’ పాత్రను చేస్తారా లేక ఏదైనా కొత్త పాత్రలో కనిపిస్తారా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. శ్రీనాథ్ ఇప్పటికే ‘యానిమల్’ వంటి భారీ బాలీవుడ్ చిత్రంలో కూడా నటించి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇక సుశాంత్ మిస్ అవుతున్నా, ‘ద బాయ్స్’ గ్యాంగ్ మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version