Site icon NTV Telugu

Srilatha Shoban Reddy : బీఆర్ఎస్‌కు GHMC డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతుల రాజీనామా

Srilatha Shoban Reddy

Srilatha Shoban Reddy

గ్రేటర్‌లో బీఆర్‌ఎస్‌కు పెద్ద దెబ్బ తగిలింది. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్మిక విభాగం అధినేత శోభన్‌రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపారు. పార్టీ విధానం వల్ల తమకు నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు బతకడం కష్టమని, కష్టకాలంలో మీ వెంట ఉన్న కార్యకర్తలు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో బాధపడ్డారన్నారు. తాను 24 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నానన్నారు.

Sajjala Ramakrishna Reddy: టీడీపీ-జనసేన పొత్తులో బలహీనత కనిపిస్తోంది.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

పార్టీలో ఉద్యమకారులకు మనుగడలేదంటూ రాజీనామా లేఖలో మోతే దంపతుల ఆవేదన వ్యక్తం చేశారు. మోతె దంపతులు శ్రీలతా శోభన్ రెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్‌ను ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే.. రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్‌లో డిప్యూటీ మేయర్ చేరనున్నారు. డిప్యూటీ మేయర్ శ్రీలత తో పాటు ఆరుగురు బీఅర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ దళిత నాయకుడు డీ రాజేశ్వర్‌రావు కాంగ్రెస్‌ గూటికి చేరారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చాలకాలం పాటు ఆయనకు ఎమ్మెల్సీగా కొనసాగిన అనుభవం ఉంది.

New Criminal Laws: జూలై 1 నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలు..

Exit mobile version