Site icon NTV Telugu

Lahiru Thirimanne: రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక క్రికెటర్

Lahiru

Lahiru

శ్రీలంక టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ లాహిరు తిరిమన్నె అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు శనివారం వీడ్కోలు పలికాడు. అతను సోషల్ మీడియా ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశం కోసం ఆడటం ఎంతో గౌరవముందని రాసుకొచ్చాడు. అంతేకాకుండా క్రికెట్ తనకు చాలా ఇచ్చిందని తెలిపాడు.

GST On EV Charging: ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను ఛార్జింగ్ చేస్తే జీఎస్టీ

రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం తనకు చాలా కష్టంగా ఉందని లాహిరు తెలిపాడు. ఒక ఆటగాడిగా అతను తన అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నించినట్ల పేర్కొన్నాడు. రిటైర్మెంట్ తీసుకోవడం కష్టమైనప్పటికీ.. తప్పలేదన్నాడు. మరోవైపు రిటైర్మెంట్ కు ప్రభావం చూపిన కారణాలను తాను చెప్పలేనని చెప్పాడు. అంతేకాకుండా తన రిటైర్మెంట్ తో మరొక యువ ఆటగాడికి అవకాశం దొరుకుతుందని చెప్పుకొచ్చాడు. దేశం కోసం క్రికెట్ ఆడటం తన జీవితంలో మరిచిపోనని తెలిపాడు.

Ponnam Prabhakar: అసంతృప్తిలో పొన్నం ప్రభాకర్.. కారణం అదే!

లాహిరు తిరిమన్నె కెరీర్ విషయానికొస్తే.., అతను 2010లో భారత్‌తో జరిగిన వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను 44 టెస్టుల్లో 3 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలతో సహా 2088 పరుగులు చేశాడు. మరోవైపు 27 వన్డేలు ఆడగా.. 4 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలతో సహా 3194 పరుగులు చేశాడు. 26 టీ20 మ్యాచ్‌లలో 291 పరుగులు చేశాడు.

Exit mobile version