Finn Allen Century: ఫిన్ అలెన్ ఊచకోత.. 16 సిక్స్‌లతో సెంచరీ! ప్రపంచ రికార్డు సమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Finn Allen hits highest score by a New Zealand Cricketer in T20I Cricket: న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఊచకోత కోశాడు. స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 62 బంతుల్లోనే 16 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో సెంచరీ (137) చేశాడు. అలెన్ సెంచరీని 48 బంతుల్లోనే బాదాడు. అలెన్ బ్యాటింగ్‌కు పాక్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. పాక్ స్టార్ పేసర్లు షాహిన్ అఫ్రిది, హరీష్ రవూఫ్ కూడా భారీగా పరుగలు సమర్పించుకున్నారు.
సెంచరీ చేసిన ఫిన్ అలెన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ హజ్రతుల్లా జజాయ్ సరసన నిలిచాడు. 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జజాయ్ 16 సిక్సర్లు బాదాడు. తాజాగా జజాయ్ రికార్డును అలెన్ సమం చేశాడు. జీషన్ కుకిఖేల్ (15), ఆరోన్ ఫించ్ (14) ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అలెన్‌దే (137) అత్యుత్తమ స్కోర్. దీనికి ముందు ఈ రికార్డు బ్రెండన్ మెక్‌కల్లమ్ (123) పేరిట ఉంది.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
Also Read: IND vs AFG: అఫ్గాన్‌తో మూడో టీ20.. క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను!
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో ఫిన్ అలెన్ ఒక్కడే చెలరేగాడు. టిమ్ సీఫర్ట్ (31) పర్వాలేదనిపించగా.. డేవాన్ కాన్వే (7), డారిల్ మిచెల్ (8), మార్క్ చాప్‌మన్ (1), మిచెల్ సాంట్నర్ (4) విఫలమయ్యారు. అలెన్ విధ్వంసం ధాటికి షాహీన్ అఫ్రిది (4-0-43-1), హరీస్ రౌఫ్ (4-0-60-2), మొహమ్మద్ నవాజ్ (4-0-44-1) 10కి పైగా ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 20 ఓవర్లలో ౭ వికెట్ల నష్టానికి 1 79 పరుగులు చేసి ఓడింది.
- Tags
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!