Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Sri Lanka Vs Oman In T20 World Cup 2026 Sri Lanka Beats Oman By 105 Runs

SL vs OMAN: పసికూనను గడగడలాడించిన శ్రీలంక.. ఓమాన్‌పై 105 పరుగుల ఘన విజయం!

Published Date :February 12, 2026 , 2:55 pm
By Kothuru Ram Kumar
SL vs OMAN: పసికూనను గడగడలాడించిన శ్రీలంక.. ఓమాన్‌పై 105 పరుగుల ఘన విజయం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

SL vs OMAN: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పల్లెకెలె వేదికగా జరిగిన గ్రూప్-B మ్యాచ్‌లో శ్రీలంక జట్టు అద్భుత ప్రదర్శనతో ఓమాన్‌పై 105 పరుగుల భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లంక జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఓమాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 120 పరుగులకే పరిమితమైంది.

T20 World Cup: ఆఫ్ఘన్ ఆల్‌రౌండ్‌కి ఐసీసీ బిగ్‌షాక్.. ఏం జరిగిందంటే..?

శ్రీలంక ఇన్నింగ్స్‌లో పావన్ రత్నాయకే 28 బంతులలో 8 ఫోర్లు, 1 సిక్స్ 60 పరుగులు చేశాడు. T20 ప్రపంచ కప్‌లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మరోవైపు కుసాల్ మెండిస్ 45 బంతుల్లో 61 పరుగులతో విలువైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. ఇక చివర్లో కెప్టెన్ దసున్ షనాకా ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 20 బంతుల్లోనే 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 50 పరుగులు చేసి మ్యాచ్‌ను పూర్తిగా లంక వైపు తిప్పేశాడు. చివర్లో కమిందు మెండిస్ (19*), దునిత్ వెలలాగే (6*) వేగంగా పరుగులు జోడించి జట్టును 225 పరుగుల భారీ స్కోర్‌కు చేర్చారు. ఓమాన్ తరఫున జితెన్ రమనంది 2 వికెట్లు తీసినా.. ఇతర బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చారు. సుఫ్యాన్ మెహ్మూద్ 4 ఓవర్లలో ఏకంగా 60 పరుగులు ఇచ్చాడు.

T20 WC 2026 Views: 15 మ్యాచ్‌లకు 875 మిలియన్ వ్యూస్, భారత్ మ్యాచ్ వ్యూస్ తెలిస్తే మెంటలెక్కుద్ది!

226 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఓమాన్‌కు ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. ఆమీర్ కలీమ్ (6), జతీందర్ సింగ్ (1) త్వరగా అవుట్ అయ్యారు. మధ్యలో మహ్మద్ నదీమ్ 56 బంతుల్లో 53 పరుగులతో పోరాడినా ఇతర బ్యాటర్లు సహకారం అందించలేదు. చివర్లో వసీమ్ అలీ 27 పరుగులతో కొంత ప్రతిఘటన చూపినా.. శ్రీలంక బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఓమాన్ 120 పరుగులకే పరిమితమైంది. దుష్మంత చమీర, మహీష్ తిక్షణలు చెరో 2 వికెట్లు తీశారు. ఇంకా దునిత్ వెలలాగే, కమిందు మెండిస్ తలా ఒక వికెట్ తీసి ఓమాన్‌ను కట్టడి చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • dasun shanaka
  • ICC T20 World Cup 2026
  • Kusal Mendis
  • Oman vs Sri Lanka highlights
  • Pavan Rathnayake

తాజావార్తలు

  • New Aadhaar Update: ఆధార్‌ అప్‌డేట్.. సెంటర్‌కు వెళ్లకుండానే ఫోన్ నంబర్ మార్చుకోండిలా!

  • CRPF Constable Recruitment 2026: గెట్ రెడీ.. 9175 కానిస్టేబుల్ పోస్టులు.. అర్హులు వీరే

  • Modi-Trump: ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్.. 40 నిమిషాల పాటు సంభాషణ..

  • AP Inter Results 2026: నిరీక్షణకు తెర.. రేపే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు..!

  • Redmi R70m 5G: రెడ్‌మీ R70m 5G రిలీజ్.. 6,300mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions