SL vs OMAN: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పల్లెకెలె వేదికగా జరిగిన గ్రూప్-B మ్యాచ్‌లో శ్రీలంక జట్టు అద్భుత ప్రదర్శనతో ఓమాన్‌పై 105 పరుగుల భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లంక జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఓమాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 120 పరుగులకే పరిమితమైంది.
T20 World Cup: ఆఫ్ఘన్ ఆల్‌రౌండ్‌కి ఐసీసీ బిగ్‌షాక్.. ఏం జరిగిందంటే..?
శ్రీలంక ఇన్నింగ్స్‌లో పావన్ రత్నాయకే 28 బంతులలో 8 ఫోర్లు, 1 సిక్స్ 60 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మరోవైపు కుసాల్ మెండిస్ 45 బంతుల్లో 61 పరుగులతో విలువైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. ఇక చివర్లో కెప్టెన్ దసున్ షనాకా ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 20 బంతుల్లోనే 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 50 పరుగులు చేసి మ్యాచ్‌ను పూర్తిగా లంక వైపు తిప్పేశాడు. చివర్లో కమిందు మెండిస్ (19*), దునిత్ వెలలాగే (6*) వేగంగా పరుగులు జోడించి జట్టును 225 పరుగుల భారీ స్కోర్‌కు చేర్చారు. ఓమాన్ తరఫున జితెన్ రమనంది 2 వికెట్లు తీసినా.. ఇతర బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చారు. సుఫ్యాన్ మెహ్మూద్ 4 ఓవర్లలో ఏకంగా 60 పరుగులు ఇచ్చాడు.
T20 WC 2026 Views: 15 మ్యాచ్‌లకు 875 మిలియన్ వ్యూస్, భారత్ మ్యాచ్ వ్యూస్ తెలిస్తే మెంటలెక్కుద్ది!
226 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఓమాన్‌కు ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. ఆమీర్ కలీమ్ (6), జతీందర్ సింగ్ (1) త్వరగా అవుట్ అయ్యారు. మధ్యలో మహ్మద్ నదీమ్ 56 బంతుల్లో 53 పరుగులతో పోరాడినా ఇతర బ్యాటర్లు సహకారం అందించలేదు. చివర్లో వసీమ్ అలీ 27 పరుగులతో కొంత ప్రతిఘటన చూపినా.. శ్రీలంక బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఓమాన్ 120 పరుగులకే పరిమితమైంది. దుష్మంత చమీర, మహీష్ తిక్షణలు చెరో 2 వికెట్లు తీశారు. ఇంకా దునిత్ వెలలాగే, కమిందు మెండిస్ తలా ఒక వికెట్ తీసి ఓమాన్‌ను కట్టడి చేశారు.
