తమిళనాడుకు చెందిన 9 మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికాదళం అదుపులోకి తీసుకుంది. సముద్ర సరిహద్దును ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేశారని రాష్ట్ర మత్స్యశాఖ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. వారివద్ద నుంచి రెండు మెకనైజ్డ్ బోట్లను స్వాధీనం చేసుకున్నారు. రామనాథపురం జిల్లాలోని మండపానికి చెందిన మత్స్యకారులు సోమవారం ఉదయం చేపల వేటకు వెళ్లగా నిన్న అర్థరాత్రి కచ్చతీవు- నెడుంతీవు మధ్య వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు వారిని అరెస్ట్ చేయడంపై మత్స్యకార సంఘాలు మండిపడుతున్నాయి.
Minister Roja: సమ్మక్క- సారక్క రీ యూనియన్.. కన్నుల పండుగగా ఉందే
సోమవారం ఉదయం మండపం ప్రాంతం నుంచి 200కు పైగా పడవల్లో మత్స్యకారుల బృందం సముద్రంలో వెటకు వెళ్లారు. కచ్చతీవు, నెడుంతీవు భారతీయ మత్స్యకారులకు చేపల వేటకు అనుమతి ఉండటంతో.. ఆ సమీపంలోకి వెళ్లారు. సోమవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న శ్రీలంక నేవీ.. బోట్‌లు అంతర్జాతీయ సరిహద్దులను దాటి శ్రీలంక పరిపాలనలో ఉన్న ప్రాంతంలో చేపలు పట్టినందుకు అరెస్టు చేశారు. ఈ ఘటనపై రామనాథపురం, తూత్తుకుడి తదితర ప్రాంతాల్లోని మత్స్యకార సంఘాలు మండిపడుతున్నారు.
Gidugu Rudraraju: మణిపూర్ అల్లర్లకు బాధ్యత వహిస్తూ.. మోడీ రాజీనామా చేయాలి
పట్టుబడిన మత్స్యకారులు మండపం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అందులో సురేష్, ఆరుముగం, మణికందన్, కుమార్ మరియు వట్టన్‌వలసాయి ప్రాంతానికి చెందిన జయశీలన్, ముత్తు, పోరియన్, నల్లతంబి, వెల్మురుగన్‌లు ఉన్నారు. శ్రీలంక నావికాదళం మొదట సముద్రంలో వారిని ప్రశ్నించి ఆపై అరెస్టు చేసింది. ఆ తర్వాత వారిని శ్రీలంకలోని స్థానిక కోర్టులో హాజరుపరచగా, వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత.. భారత మత్స్యకారులపై శ్రీలంక నావికాదళం ఆగ్రహం చల్లారిపోతుందని మత్స్యకార వర్గాలు అనుకున్నాయి. ఇద్దరు ప్రధానుల సమావేశం అనంతరం 15 మంది మత్స్యకారులను శ్రీలంకలోని మల్లాడి జైలు నుంచి విడుదల చేశారు. మరోవైపు తమిళనాడులోని మత్స్యకార సంఘం ప్రతినిధి మాట్లాడుతూ.. కేంద్రం జోక్యం చేసుకుని తమను ఆదుకోవాలనీ, తమ వర్గానికి రక్షణ కల్పించాలని ఆయన కోరారు. మత్స్యకారులపై కేసు నమోదు చేయకుండా వెంటనే విడుదల చేయాలని ఆయన పేర్కొన్నారు.
