Ranil Wickremesinghe arrest: శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranil Wickremesinghe arrest: శ్రీలంకలో మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను శుక్రవారం సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన దేశ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రభుత్వ డబ్బును ఉపయోగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో సీఐడీ ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి కార్యాలయానికి రావాలని పిలిచింది. ఆయన సీఐడీ కార్యాలయానికి వచ్చి తన వాంగ్మూలాన్ని ఇచ్చిన అనంతరం అదుపులోకి తీసుకుంది. ఈక్రమంలో ఆయనను కొలంబో ఫోర్ట్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
READ ALSO: Kurnool : తీవ్ర విషాదం.. నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి
Also Read
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
కథ అడ్డం తిప్పిన లండన్ పర్యటన..
2023 సెప్టెంబర్‌లో మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే లండన్ పర్యటన సందర్భంగా ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేశారని CID చెబుతోంది. ఈ పర్యటన సమయంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఖర్చులను కూడా ప్రభుత్వ ఖజానా నుంచి వాడుకున్నారని సీఐడీ వాదన. పలు నివేదికల ప్రకారం.. 2023 సెప్టెంబర్‌లో ఆయన క్యూబాలోని హవానాకు వెళ్లారు. అక్కడ జరిగిన G77 సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన తిరిగి వస్తుండగా లండన్‌లో ఆగి, తన భార్య ప్రొఫెసర్ మైత్రీ విక్రమసింఘే స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ మొత్తం పర్యటన అధికారిక కార్యక్రమం కంటే వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందని, ఈ ఖర్చులన్ని ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టారని CID ఆరోపించింది.
విక్రమసింఘే స్పందన..
మాజీ అధ్యక్షుడు CID ఆరోపణలను ఖండించారు. తన భార్య తన ప్రయాణ, బస ఖర్చులను స్వయంగా ఆమె భరించిందని, ప్రభుత్వ డబ్బును వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించలేదని స్పష్టం చేశారు. కేవలం ఇది రాజకీయ ప్రతీకార చర్యగా అని ఆయన అభివర్ణించారు. తగిన ఆధారాలు లభించిన తర్వాతే మాజీ అధ్యక్షుడిని అరెస్టు చేసినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!