NTV Telugu Site icon

Sri Lanka Record: శ్రీలంక టీమ్ అరుదైన ఘనత.. 48 ఏళ్ల భారత్‌ రికార్డు బ్రేక్‌!

Sri Lanka Record

Sri Lanka Record

Sri Lanka Break 48 Year Old India Massive Test Record: శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. ఓ ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా లేకుండా.. అత్యధిక స్కోర్‌ చేసిన జట్టుగా నిలిచింది. ఛటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఈ రికార్డు సాధించింది. దాంతో 48 ఏళ్ల క్రితం భారత్ నెలకొల్పిన రికార్డు బద్దలైంది. 1976లో భారత్ ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా లేకుండా 529 పరుగులు చేయగా.. తాజాగా శ్రీలంక శతకం లేకుండా 531 పరుగులు చేసింది.

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 531 పరుగులకు ఆలౌటైంది. చివరి ఇద్దరు బ్యాటర్లు మినహా తొమ్మిది మంది రెండంకెల స్కోరు చేశారు. నిషాన్ మదుష్క (57), దిముత్ కరుణరత్నే (86), కుసాల్ మెండిస్ (93), దినేష్ చండిమాల్ (59), ధనంజయ డి సిల్వా (70), కమిందు మెండిస్ (92) అర్ధ శతకాలు సాధించారు. ఏంజెలో మ్యాథ్యూస్ (23), జయసూర్య (28), విశ్వ ఫెర్నాండో (11) రెండంకెల స్కోరు చేశారు.

Also Read: SRH vs CSK Tickets 2024: ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్-చెన్నై మ్యాచ్.. నకిలీ టిక్కెట్ల హల్‌చల్! బీ అలెర్ట్

కాన్పూర్‌లో 1976లో న్యూజిలాండ్‌పై భారత్ 524/9 స్కోరు చేసి డిక్లేర్డ్‌ చేసింది. బిషన్ సింగ్ బేడీ భారత జట్టుకు నాయకత్వం వహించగా.. ఆరుగురు భారత ఆటగాళ్లు అర్ద సెంచరీలు చేసారు. ఇప్పటివరకు ఇదే రికార్డు కాగా.. తాజాగా శ్రీలంక ఆ రికార్డు బద్దలు కొట్టింది. 2009లో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా 520/7 (డిక్లేర్డ్), 1998లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 517, 1981లో ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ 500/8 (డిక్లేర్డ్) ఒక్క సెంచరీ లేకుండా భారీ స్కోర్లు సాధించాయి.