UN Security Council: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య హోదా కోసం భారత్, జపాన్‌ల బిడ్‌లకు తమ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మంగళవారం తెలిపారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన అధ్యక్షుడు విక్రమసింఘే ప్రస్తుతం జపాన్‌లో ఉన్నారు. మంగళవారం జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషితో జరిగిన సమావేశంలో విక్రమసింఘే మాట్లాడుతూ.. “అంతర్జాతీయ వేదికపై జపాన్ శ్రీలంకకు అందించిన మద్దతును ప్రశంసించారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం జపాన్, భారతదేశం చేస్తున్న ప్రచారానికి మద్దతు ఇవ్వడానికి సుముఖతను వ్యక్తం చేశారు. ” అని రాష్ట్రపతి కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
భద్రతామండలిలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రతిపాదనల పరంగా భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం భద్రతా మండలిలో రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, అమెరికా శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. . ఈ ఐదు దేశాల్లో ఇప్పటికి నాలుగు దేశాలు భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడానికి మద్దతు తెలిపాయి. కేవలం ఒక చైనా మాత్రమే అడ్డుకుంటోంది. మరో 10 తాత్కాలిక శాశ్వత సభ్యదేశాలుగా వ్యవహరిస్తాయి. వీటిని ప్రతి రెండేళ్లకోసారి ఐరాస సర్వప్రతినిధి సభ ఎన్నుకుంటుంది.
Delhi Excise Policy Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరొకరు అరెస్ట్
శాశ్వత దేశాలైన రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, అమెరికా దేశాలు ఏదైనా ముఖ్యమైన తీర్మానాన్ని వీటో చేయగలవు. సమకాలీన ప్రపంచ వాస్తవికతను ప్రతిబింబించేలా శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఎన్నుకోబడిన తాత్కాలిక శాశ్వత సభ్యదేశమైన భారతదేశం తన రెండేళ్ల పదవీ కాలం డిసెంబర్‌లో ముగియనుంది.
