Site icon NTV Telugu

SRH vs RCB: కోహ్లీ నామస్మరణతో మార్మోగిన ఉప్పల్ స్టేడియం.. రేపే మ్యాచ్..

Virat Kohli

Virat Kohli

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో మరో మ్యాచుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఈ గ్రౌండ్ లో మార్చి 27న హైదరాబాద్, ముంబై జట్లు తలపడగా.. ఏప్రిల్ 5న హైదరాబాద్, చెన్నై జట్లు తలపడ్డాయి. ఇకపోతే గురువారం నాడు హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే స్టేడియంకు ఆటగాళ్లు చేరుకొని ప్రాక్టీస్ ఉమ్మరంగా చేస్తున్నారు.

Also Read: Shocking video: బైకర్‌పై దూసుకెళ్లిన బస్సు.. పట్టించుకోని బాటసారులు.. వీడియో వైరల్

ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాడైన విరాట్ కోహ్లీని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియం దగ్గరికి వచ్చారు. కోహ్లీ వచ్చిన సమయంలో క్రికెట్ అభిమానులు కోహ్లీ.. కోహ్లీ.. అంటూ పెద్దగా నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం మొత్తం కోహ్లీ నామస్మరణతో మార్మోగింది. ఈ మ్యాచ్ కు సంబంధించి స్టేడియంలో 2500 మందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం ఉన్న పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మ్యాచ్ కోసం ఆర్టీసీ, అలాగే మెట్రో రైలు ప్రత్యేక సర్వీసులను నడపబోతున్నాయి.

Also Read: GT vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్..

ఇక ఈ సిరీస్ లో హైదరాబాదులో మరో నాలుగు మ్యాచ్లు జరగనున్నాయి. ఇక వాటి వివరాలు చూస్తే.. మే 2న హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య, మే 8న లక్నో, హైదరాబాద్ జట్ల మధ్య, మే 16న హైదరాబాద్, గుజరాత్ ల మధ్య, మే 19న హైదరాబాద్, పంజాబ్ మధ్య మ్యాచులు జరగనున్నాయి.

Exit mobile version