Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tickets Prices Hike: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేఉకోవడంతో ప్లేఆఫ్స్ పోరు మరింత ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనున్న కీలక మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు ఎస్ఆర్హెచ్ (SRH) యాజమాన్యం టికెట్ ధరలను భారీగా పెంచేసింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం టికెట్ ధరలను 50% నుంచి 110% వరకు పెంచినట్లు సమాచారం. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ మ్యాచ్ టికెట్ బుకింగ్స్ మే 15 సాయంత్రం 5 గంటల సమయంలో జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే వెయిటింగ్ లిస్ట్ 2.60 లక్షలకు చేరుకోవడం మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది. ఇప్పటివరకు రూ.950 నుంచి రూ.30,000 వరకు ఉన్న టికెట్లు, ఇప్పుడు ఏకంగా రూ.2,000 నుంచి రూ.45,000 వరకు పెరిగాయి. ముఖ్యంగా సౌత్ ఫస్ట్ టెర్రస్ టికెట్ ధర రూ.1500 నుంచి రూ.3000కు పెరగడం అభిమానులను షాక్‌కు గురిచేసింది.
Also Read
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
అలాగే గతంలో రూ.900 ఉన్న అప్పర్ టియర్ స్టాండ్స్ టికెట్లు ఇప్పుడు రూ.2000కు పెంచారు. అంటే దాదాపు 110% పెరుగుదల నమోదైంది. ఇక కార్పొరేట్ బాక్స్ టికెట్లు రూ.30,000 నుంచి రూ.45,000కు పెరిగాయి.
కొత్త టికెట్ ధరలు ఇలా ఉన్నాయి:
* రూ.950 → రూ.2000
* రూ.1500 → రూ.3000
* రూ.1910 → రూ.3500
* రూ.2500 → రూ.4500
* రూ.4500 → రూ.6000
* రూ.7000 → రూ.10000
* రూ.23000 → రూ.30000
* రూ.30000 → రూ.45000
ఈ భారీ ధరల పెంపుపై అభిమానులు సోషల్ మీడియా వేదికల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ అభిమానులకు మ్యాచ్ చూడటం కష్టమవుతోంది అంటూ విమర్శిస్తున్నారు.
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!