NTV Telugu Site icon

SRH vs KKR Final Match: మూడోసారి ఛాంపియన్ గా కోల్‌కతా నైట్ రైడర్స్ అవతరిస్తుందా.. ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధం..

Ipl Final

Ipl Final

ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ ఆదివారం మే 26, 2024న మే 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని, కేకేఆర్ క్వాలిఫయర్ 1లో నేతృత్వంలోని SRH ను ఓడించి ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. మరోవైపు, ఆరెంజ్ ఆర్మీ క్వాలిఫయర్ 2లో సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గ్రాండ్‌ గా ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

PM Modi: నేడు యూపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..

లీగ్ దశలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండూ వరుసగా పట్టికలో అగ్రస్థానంలో నిలిచాయి. శ్రేయాస్ అయ్యర్ జట్టు 14 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలతో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎనిమిది మ్యాచ్‌లలో గెలిచి ఐదు ఓడిపోయి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. దింతో కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది.

IPL: ఫస్ట్ సీజన్లోనే ఫైనల్కు తీసుకెళ్లిన కెప్టెన్లు వీళ్లే..

ఈ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడడం ఇది మూడోసారి. కోల్‌కతా నైట్ రైడర్స్ 2012, 2014లో 2 ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకోగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో ట్రోఫీని కైవసం చేసుకుంది. హైదరాబాద్, కోల్‌కతా జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. నైట్ రైడర్స్ హైదరాబాద్ జట్టుపై చాలా ఆధిపత్యాన్ని కలిగి ఉంది. కేకేఆర్ 18 గెలిచి., తొమ్మిది మ్యాచ్‌ లలో మాత్రమే ఓడిపోయింది.

Show comments