NTV Telugu Site icon

SRH Team: ఇషాన్, షమీ, సచిన్‌.. ఈసారి పక్కా కప్! సన్‌రైజర్స్ ఫుల్ టీమ్ ఇదే

Srh Full Squad Ipl 2025

Srh Full Squad Ipl 2025

రెండు రోజుల పాటు జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2025 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. మొత్తం 182 మంది క్రికెటర్లను 10 ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉండగా.. 120 మంది స్వదేశీ ప్లేయర్స్ ఉన్నారు. వేలంలో 8 మందిని టీమ్స్ ఆర్టీఎం చేసుకున్నాయి. 10 జట్లు కలిపి ప్లేయర్స్ కోసం మొత్తం రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. మన తెలుగు జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 15 మంది కొనుగోలు చేసింది. దాంతో మొత్తంగా 20 మంది ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇందులో విదేశీ ప్లేయర్స్ ఏడుగురు ఉన్నారు. వేలం అనంతరం సన్‌రైజర్స్ వద్ద రూ.20 లక్షలు మిగిలాయి. ‘

ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పక్కా ప్రణాళికతో ఆటగాళ్లను కొనుగోలు చేశారు. కావాల్సిన ఆటగాళ్లపై మాత్రమే ఫోకస్ పెట్టిన కావ్య.. పటిష్ట జట్టును తయారు చేసుకున్నారు. తొలి రోజు వేలంలో దూకుడు కనబర్చిన కావ్య పాప.. టాప్ ఆటగాళ్లను సొంతం చేసుకున్నారు. ఇక రెండో రోజు చిన్న ఆటగాళ్లపై దృష్టి పెట్టారు. ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు), మహమ్మద్ షమీ (రూ.10 కోట్లు), హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు), ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు), జయ్‌దేవ్ ఉనద్కత్ (రూ.కోటి), వంటి అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు అభినవ్ మనోహర్ (రూ.3.20 కోట్లు), సిమర్‌జీత్ సింగ్ (రూ.1.50 కోట్లు), జిషాన్ అన్సారీ (రూ.40 లక్షలు), సచిన్‌ బేబి (రూ.30లక్షలు), అంకిత్ వర్మ (రూ.30 లక్షలు), అథర్వ తైడే (రూ.30 లక్షలు) లాంటి అనామక ఆటగాళ్లతో జట్టును పటిష్టం చేశారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు), పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి (రూ.6 కోట్లు)లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇప్పుడు ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, జయ్‌దేవ్ ఉనద్కత్, అభినవ్ మనోహర్, రాహుల్ చహర్, ఆడమ్ జంపాలు జత కలిశారు. దాంతో బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా ఉంది. ఈసారి పక్కా కప్ సన్‌రైజర్స్ అంటున్నారు. 2024లో కావ్య మేడమ్ టీమ్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా:
1. మహమ్మద్ షమీ: రూ 10 కోట్లు
2. హర్షల్ పటేల్ – రూ 8 కోట్లు
3. ఇషాన్ కిషన్ – రూ 11.25 కోట్లు
4. రాహుల్ చహర్ – రూ 3.2 కోట్లు
5. ఆడమ్ జంపా – రూ 2.4 కోట్లు
6. అథర్వ తైదే – రూ. 30 లక్షలు
7. అభినవ్ మనోహర్ – రూ 3.2 కోట్లు
8. సిమర్‌జీత్ సింగ్ – రూ 1.5 కోట్లు
9. జీషన్ అన్సారీ – రూ. 40 లక్షలు
10. జయదేవ్ ఉనద్కత్ – రూ. 1 కోటి
11. బ్రైడన్ కార్సే – రూ. 1 కోటి
12. కమిందు మెండిస్ – రూ. 75 లక్షలు
13. అనికేత్ వర్మ – రూ. 30 లక్షలు
14. ఎషాన్ మలింగ – రూ. 1.2 కోట్లు
15. సచిన్ బేబీ – రూ. 30 లక్షలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ లిస్ట్:
1.హెన్రీచ్ క్లాసెన్(రూ. 23 కోట్లు)
2.ప్యాట్ కమిన్స్(రూ. 18 కోట్లు)
3.ట్రావిస్ హెడ్(రూ. 14 కోట్లు)
4.అభిషేక్ శర్మ(రూ.14 కోట్లు)
5.నితీష్ కుమార్ రెడ్డి(రూ.6 కోట్లు)

 

Show comments