NTV Telugu Site icon

Pushpa 2 : పుష్ప 2లో ఏడిపించనున్న శ్రీవల్లి.. ఈ పార్టులో ఆ పాత్ర ముగుస్తుందా ?

Pushpa2

Pushpa2

Pushpa 2 : పుష్ప 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. డిసెంబర్ ఐదో తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతోంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ది రైజ్ సూపర్ హిట్ కావడంతో రెండో పార్టు మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించారు. నిజానికి బీహార్ రాష్ట్రానికి ఒకప్పుడు దోపిడీ దొంగలకు నెలవుగా భావించేవారు. ఇప్పటికీ బీహార్ వెనకబడి ఉన్న రాష్ట్రంగానే చాలామందికి తెలుసు కానీ అలాంటి చోట పుష్ప 2 ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేయడమే ఒక సాహసం. ఆ సాహసాన్ని అత్యంత సునాయాసంగా జరిపి ప్రేక్షకులందరికీ చేత ఇంకేం అల్లు అర్జున్ అభిమానుల చేత ప్రశంసలు కూడా అందుకుంది సినిమా టీం.

Read Also:Hyderabad: మాదాపూర్‌లో ఓవైపునకు ఒరిగిన 5 అంతస్తుల భవనం.. తప్పెవరిది?

అయితే ఈ ఈవెంట్ అక్కడ ఎలాంటి టెన్షన్ లేకుండా ఇబ్బందులు కలగకుండా నిర్వహించడానికి ముఖ్య కారణం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు చెందిన మైత్రి సాయి అలియాస్ బాబాసాయిగా తెలుస్తోంది. పుష్ప మొదటి భాగంతో పాటు రెండో భాగానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఆయన ఈవెంట్ విషయంలో అన్ని తానై వ్యవహరించినట్లు తెలుస్తోంది. తెలుగు సినీ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ యువి మీడియాతో కలిసి ఆ సంస్థ అధినేత వెంకట్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ కి రూపకల్పన చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇండియాలోనే అతిపెద్ద ఈవెంట్స్ లో ఒకటిగా ఈ ఈవెంట్ ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు నార్త్ అంటే ముంబై, ఢిల్లీ మాత్రమే గుర్తొచ్చేవి కానీ ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కి పాట్నా లాంటి ప్రదేశంలో కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా చేసుకోవచ్చని వీరిద్దరూ ఒకరకంగా కొత్త ట్రెండ్ సెట్ చేశారని చెప్పొచ్చు.

Read Also:Virat Kohli: విరాట్ కోహ్లీని అక్కడే టార్గెట్‌ చేయండి.. ఆస్ట్రేలియా బౌలర్లకు హీలీ సూచన!

ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో అందాల భామ రష్మిక మందన్న.. శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ‘పుష్ప-2’లో శ్రీవల్లి పాత్ర ట్రాజెడీగా ముగుస్తుందని.. ట్రైలర్‌లో దీనికి సంబంధించిన క్లూ కూడా కనిపించిందనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో నిజంగానే ‘పుష్ప-2’ మూవీలో శ్రీవల్లి పాత్ర ముగుస్తుందా.. ట్రాజెడీగా ముగిసే ఈ పాత్ర ప్రేక్షకులను ఏడిపిస్తుందా.. అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ వార్తకు ఎలాంటి సమాధానం దొరుకుతుందో తెలియాలంటే డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.

Show comments