కుర్రాళ్ల కలల రాకుమారి శ్రీలీలా ప్రస్తుతం బిజీ టాలివుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది.. చేతిలో ఎప్పుడూ అర డజను సినిమాలను పెట్టుకుంటుంది.. ఓ పక్క సినిమాలకు కష్టపడుతూనే మరో పక్క డాక్టర్ కోర్స్ కూడా పూర్తి చేస్తుంది. సినిమాల్లో తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకులని మెప్పిస్తుంది. శ్రీలీలకు ప్రస్తుతం ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు చేతి నిండా సినిమాలతో ఫుల్ వర్క్ కూడా ఉంది. టాలీవుడ్ లో ఎక్కడ విన్నా, ఏ ఈవెంట్ చూసినా శ్రీలీల పేరు వినిపిస్తుంది..
ప్రస్తుతం ఈ అమ్మడు నితిన్ హీరోగా చేస్తున్న ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. టాలీవుడ్ రైటర్ వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.. హీరో రాజశేఖర్ ముఖ్య పాత్ర చేయడం విశేషం. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పలు సాంగ్స్ రిలీజ్ చేయగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నిన్న హైదరాబాద్ లో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా మూవీ యూనిట్ అందరు పాల్గొన్నారు..
ఈ సందర్బంగా నితిన్ మాట్లాడుతూ.. శ్రీలీలకు ఉన్న మరిన్ని ట్యాలెంట్స్ బయటపెట్టాడు. నితిన్ మాట్లాడుతూ.. నేను ఇప్పటికే చాలా సినిమాలు చేశాను. నేను హీరో, డ్యాన్స్ వచ్చు నాకు అని మాములుగానే ఉంటుంది. శ్రీలీల కూడా బాగా యాక్టింగ్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుందని తెలుసు. డాక్టర్ చదువుతుందని తెలుసు. షూటింగ్ మొదటి రోజే శ్రీలీల వచ్చింది. తన గురించి అడిగితే చెప్పింది. తాను యాక్టింగ్, డ్యాన్స్, డాక్టర్ మాత్రమే కాదు స్విమ్మింగ్ లో స్టేట్ లెవెల్ లో ఆడింది, హాకీ స్టేట్ లెవెల్ లో ఆడింది. తనకి కూచిపూడి, భరత నాట్యం కూడా వచ్చు. ఇంకా వీణ వాయిస్తుంది. ఇంకా చాలా చెప్పింది. నేను ఆ రోజు చాలు ఇంకా అనకపోతే ఇంకా తన ట్యాలెంట్స్ బయటపడేవి. ఇంత చిన్న పిల్లలో ఇన్ని ట్యాలెంట్స్ అని ఆశ్చర్యపోయాను.. నిజంగా తాను గ్రేట్ అంటూ నితిన్ పొగడ్తలతో ముంచేసాడు.. ఇందుకు సంబందించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ నెల 8 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.